న్యూఢిల్లీ: ప్రభుత్వం చిన్నపిల్లలకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ‘చైల్డ్ లైన్ 1098’కి 21 రోజుల లాక్‌డౌన్ కాలంలో 4.6 లక్షల ఫోన్‌కాల్స్ వచ్చాయని చైల్డ్‌లైన్ ప్రకటించింది. ఇందులో అత్యధిక భాగం లాక్‌డౌన్ అమలులో ఉన్న మార్చి 20– ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చినట్లు తెలిపింది. వీటిలో ఉత్తరాది నుంచి 30 శాతం, పశ్చిమ భారతం నుంచి 29 శాతం, దక్షిణాది నుంచి 21 శాతం, తూర్పు భారతం నుంచి 20 శాతం కాల్స్ వచ్చాయని వెల్లడించింది. ఈ కాలంలో చైల్డ్ లైన్ 1098 వలంటీర్లు క్షేత్ర స్థాయిలో మొత్తం 9385 కేసులను పరిష్కారించారు.
వచ్చిన మొత్తం కేసుల్లో 30 శాతం ఈ మహమ్మారిపై వివరణ కోరాయి. కరోనా వైరస్‌కి సంబంధించిన వాటిల్లో 91 శాతం మంది ఆహారం కావాలనీ, 6 శాతం మంది వైద్యసహాయం కావాలనీ, మిగిలిన వారు రవాణా సౌకర్యం కల్పించాలనీ కోరారని హెల్ప్‌లైన్ చెప్పింది. చాలా మంది పిల్లలకు మొబైల్ ఫోన్ సౌకర్యం లేని కారణంగా ఇటువంటి కాల్స్ చేసే అవకాశం వారికి రాలేదని చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 అభిప్రాయపడింది.
చదవండి: లాక్‌డౌన్ సడలిస్తే కష్టమే..!
Comments
Please login to add a commentAdd a comment