సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణ మన దేశంలో ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. అన్‌లాక్ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోవిడ్ కేసుల సంఖ్యగా భారీగా పెరుగుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 7 లక్షల మార్క్‌ను దాటగా, మరణాల సంఖ్య 20 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కోవిడ్ బారిన పడినవారిలో గత 24 గంటల్లో 467 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 20,160కు చేరింది. (2021 దాకా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు..)
గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపారు. 4,39,947 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 61.13 శాతంగా నమోదయింది. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయి. (కరోనా బాధితుల్లో ‘ప్రివొటెల్లా’)
Comments
Please login to add a commentAdd a comment