సాక్షి, న్యూఢిల్లీ : వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక (5టీ ప్లాన్)ను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 5టీ ప్లాన్ గురించి వివరించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, టీమ్ వర్క్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అనేదే 5 టీ (5T) ప్లాన్‌ను సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 12 వేల హోటల్ గదులను అద్దెకు తీసుకుని క్యారంటైన్ కేంద్రాలుగా మార్చబోతున్నామని చెప్పారు. 8 వేల మందికి సరిపోయేలా అత్యవసర చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
(చదవండి : కరోనాపై పోరు: ‘మీ మద్దతు కావాలి’)
5 టీ ప్లాన్ అమలు ఇలా..
1) రాష్ట్రంలోని ఐదు లక్షల మందికి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించడం (టెస్టింగ్).
2) దేశరాజధానిలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడం (ట్రేసింగ్)
3) పాజిటివ్ కేసులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించడం (ట్రీట్‌మెంట్)
4) ప్రభుత్వ వ్యవస్థల మధ్య పూర్తిస్థాయి సమన్వయంతో ఒక జట్టుగా కరోనాపై పోరాటం చేయడం (టీమ్ వర్క్)
5) మర్కజ్ లో పాల్గొన్న వారిని త్వరగా గుర్తించి, వారు కలిసిన ఇతరుల పై పర్యవేక్షించడం (ట్రాకింగ్ అండ్ మానిటరింగ్)
Comments
Please login to add a commentAdd a comment