సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కరోనావైరస్ వ్యాప్తిపై చర్చించారు. ఐదు రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు టెస్టులు, బెడ్‌ల సంఖ్య పెంచాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని సూచించారు. (చదవండి :మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్)
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రులను ఆదేశించారు. దీంతో ఈ నెల 14 (ఆదివారం)న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్‌తో హోంమంత్రి అమిషా భేటీ కానున్నారు. కాగా, ఈ నెల 16, 17 వ తేదీల్లో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్, లాక్‌డౌన్ పరిస్థితులపై వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ( చదవండి : రేపు అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ)
Comments
Please login to add a commentAdd a comment