
సాక్షి, న్యూఢిల్లీ : మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య 24,942కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 779 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 5,210 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 18,953 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
(చదవండి : ‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’)
ఇప్పటి వరకు సంభవించిన 779 మరణాలలో అత్యధికంగా మహారాష్ట్రలో 301, గుజరాత్‌లో 127, మధ్యప్రదేశ్‌లో 92, ఢిల్లీలో 53, ఏపీలో 29, రాజస్తాన్‌లో 27, తెలంగాణలో 26, ఉత్తర ప్రదేశ్‌లో 26, తమిళనాడులో 22, కర్ణాటక 18, పశ్చిమ బెంగాల్‌లో 18 మంది ఉన్నారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 6817 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2815, ఢిల్లీలో 2514, రాజస్తాన్‌లో 2034, గుజరాత్‌లో 2815, మధ్యప్రదేశ్‌లో 1952, ఉత్తర ప్రదేశ్‌లో 1778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment