775కు చేరిన కరోనా మృతుల సంఖ్య | COVID-19: Death toll at 775 as active cases tally crosses 18,000 | Sakshi
Sakshi News home page

భారత్‌లో 775కు చేరిన కరోనా మృతుల సంఖ్య

Published Sat, Apr 25 2020 9:24 AM | Last Updated on Sat, Apr 25 2020 12:36 PM

COVID-19: Death toll at 775 as active cases tally crosses 18,000 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 57మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 775కి చేరింది. కాగా దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకూ మొత్తం 24,506 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  అలాగే 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా,  5,063 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 301మంది చనిపోగా, గుజరాత్‌లో 127మంది, ఢిల్లీలో 53మంది మృతి చెందారు. (ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం)

కాగా దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. (సీఆర్పీఎఫ్ వాన్లకు సోకిన రోనా)

కేంద్ర హోం శాఖ తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపనుంది. ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి  గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. (దాయాది దేశంలో లాక్డౌన్ పొడిగింపు)

మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో నిన్న ఒక్కరోజే 3,100మంది మత్యువాత పడ్డారు. యూఎస్‌లో కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 51,071కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య  27,90,986కి దాటింది. (రసాయనాలు తాగించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement