తిరువనంతపురం : కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణై తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐసోలేషన్ వార్డులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. తిరువనంతపురం జిల్లా అనద్ గ్రామంలో పెయింటింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న 33 సంవత్సరాల వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో మద్యం కోసం తమిళనాడు వెళ్లగా మే 28న అతడికి కరోనా వైరస్ పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో అతడిని తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌కు తరలించి చికిత్స అందచేస్తున్నారు. అయితే ఆస్పత్రి నుంచి ఈనెల 9న పారిపోయి ఆటో, బస్సు ద్వారా ఇంటికి చేరుకున్నాడు. స్ధానిక అధికారులు గుర్తించడంతో వైద్య అధికారులు అతడికి నచ్చచెప్పి తిరిగి తిరువనంతపురం ఆస్పత్రికి తీసుకువచ్చారు.
కోవిడ్-19 రోగిని తిరిగి ఆస్పత్రికి చేర్చేందుకు అంబులెన్స్‌తో అధికారులు రాగా, మద్యం డిమాండ్ చేయడంతో వారు అవాక్కయ్యారు. గంటపాటు అతడికి సర్ధిచెప్పిన అనంతరం తిరిగి మెడికల్ కాలేజ్‌కు వచ్చేందుకు అంగీకరించాడు. కాగా ఐసోలేషన్ వార్డు నుంచి కోవిడ్-19 రోగి అదృశ్యంపై ఆరోగ్య మంత్రి కేకే శైలజ విచారణకు ఆదేశించారు. మరోవైపు మద్యం తాగే సమయంలో అతడు మరో నలుగురికి వైరస్‌ను వ్యాప్తి చేశాడని అధికారులు పేర్కొన్నారు. (కోవిడ్-19 : భారీగా మెరుగుపడిన రికవరీ రేటు)
Comments
Please login to add a commentAdd a comment