ఉన్మాది శంకర్ పట్టివేత | criminal shankar arrested | Sakshi
Sakshi News home page

ఉన్మాది శంకర్ పట్టివేత

Published Sat, Sep 7 2013 4:33 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

criminal shankar arrested


 సాక్షి, బెంగళూరు: కర్ణాటక, తమిళనాడుల్లో పలు లైంగిక దాడులు, హత్యలకు పాల్పడి.. జైలు శిక్ష అనుభవిస్తూ తప్పించుకున్న ఉన్మాది శంకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. గత శనివారం రాత్రి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి శంకర్ తప్పించుకున్న విషయం తెలిసిందే. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల బహుమతిని కూడా ప్రకటించింది. అయితే.. శుక్రవారం ఉదయం స్థానికుడి మొబైల్ ఫోన్ నుంచి శంకర్ తన స్నేహితుడితో మాట్లాడాడు. దానిపై నిఘా పెట్టిన పోలీసులు బెంగళూరు శివార్లలోని కూడ్లు గేట్ వద్ద ఓ గుడిసెలో శంకర్ ఉన్నట్లు గుర్తించి, అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement