ముంబై: రక్తంలో కలిసిపోయి ప్రవహిస్తున్న కేన్సర్ కణాలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించగల ఒక కొత్త 3డీ విధానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ఒక కేన్సర్ గడ్డకు వేలకొద్దీ కేన్సర్ కణాలు వదులుగా తగులుకుని ఉంటాయి. ఇవి తరచుగా గడ్డ నుంచి విడిపోయి రక్తంతో కలిసి ప్రవహించి శరీరంలోని ఇతర భాగాలకు చేరి అక్కడ కూడా కేన్సర్‌ను వ్యాపింపజేస్తాయి. కేన్సర్ వల్ల మరణాలు సంభవించడానికి 90 శాతం కారణం ఇదే’అని శాస్త్రవేత్తలు జయంత్ ఖండరే, శాశ్వత్ బెనర్జీ చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న రోగాల్లో కేన్సర్ ఒకటనీ, 2013లో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల కొత్త కేన్సర్ కేసులు గుర్తించారని తెలిపారు.
అదే ఏడాది కేన్సర్ వల్ల 82 లక్షల మంది మరణించారన్నారు. మహారాష్ట్ర ఫార్మసీ ఇన్‌స్టిట్యూట్, అక్టోరియస్ ఇన్నొవేషన్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, పుణెలోని మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మెడికల్ కాలేజ్‌లకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు.
కేన్సర్ కణాల ఏరివేతకు కొత్త విధానం
Published Tue, Jan 31 2017 1:50 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement