రేపు కేంద్ర కేబినెట్ చర్చ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) 10 శాతం మేర పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుత 80% డీఏని 90 శాతానికి పెంచే అంశంపై ఈ నెల 20న జరిగే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 30 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం లభించనుంది. గత జూలై 1వ తేదీ నుంచి ఈ పెంపు వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు మూడేళ్ల తర్వాత ఉద్యోగులకు రెండంకెల డీఏ మంజూరు కానుంది. ఈ పెంపుతో వార్షిక వ్యయం అదనంగా రూ.10,879 కోట్ల మేరకు పెరగనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై రూ.6,297 కోట్ల అదనపు భారం పడుతుందని ఆ వర్గాలు వివరించాయి.
కేంద్ర ఉద్యోగులకు డీఏ 10 శాతం పెంపు!
Published Thu, Sep 19 2013 4:09 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement