దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్ | Dawood's man involved in 1993 Mumbai blasts arrested | Sakshi
Sakshi News home page

దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్

Published Sun, Feb 15 2015 5:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్

దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్

పనాజీ:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ కు చెందిన మరో అనుచరుడ్ని తాజాగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుడు శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్(50) ఆదివారం  పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగో పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.

 

అతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వలపన్ని అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి కశ్యప్ తెలిపారు. ఆనాటి ముంబై పేలుళ్లలో 250 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే దావూద్ గ్యాంగ్ చెందిన పలువురు వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement