laden
-
‘లాడెన్’ను చంపటానికి అనుమతించండి!
అస్సాం : అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు కావొస్తుంది.. అయినా చనిపోయిన లాడెన్‌ను చంపాలనుకోవడమేంటని అనుకుంటున్నారా? ఇక్కడ లాడెన్ అన్నది ఓ మగ ఏనుగు పేరు. దాని రూపం, ఎత్తు చూసి అసోంలోని గోల్పరా అటవీ ప్రాంత ప్రజలు దానికి ఆ పేరు పెట్టారు. అడవి చుట్టు పక్కల నివసిస్తున్న ప్రజలకు లాడెన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 37 మందిని చంపినట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మదపుటేనుగుగా మారిన లాడెన్‌ను చంపి దాని బారి నుంచి ప్రజల్ని రక్షించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులను అనుమతి కోరారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని గోల్పరా అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రజలపై లాడెన్ దాడి చేసి చంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 1న పట్‌పారా పహర్‌టోలి గ్రామానికి చెందిన మనోజ్ హజోంగ్ అనే వ్యక్తి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అడ్డువచ్చిన అతన్ని తొక్కి చంపేసింది. అటవీ సంరక్షణాధికారులు మాట్లాడుతూ.. లాడెన్ గోల్పరా అడవుల్లో అడుగుపెట్టిన తర్వాత దాదాపు 37 మందిని చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కువగా సాయంత్రం, రాత్రి సమయాల్లో దాడి చేస్తోందన్నారు. ఏనుగుల గుంపును చూసిన వెంటనే గిరిజనులు వాటిని తరమటానికి చేసే ప్రయత్నం వల్ల ఒక్కో సారి ఏనుగులు దాడికి తిరగబడే అవకాశం ఉందన్నారు. ఒంటరిగా ఉన్న ఏనుగులు చాలా ప్రమాదకరమని తెలిపారు. దాడి జరిగిన ప్రతిసారి 10-15 రోజులు ఆ ఏనుగు కనిపించకుండా పోతోందన్నారు. చాలా దాడులు నెలలోని చివరి రోజుల్లో జరిగాయన్నారు. లాడెన్‌ను మదపుటేనుగుగా గుర్తించి చంపటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. 2006లో సోనిత్‌పుర్ జిల్లాలోని లాడెన్ అనే ఓ ఏనుగును మదపుటేనుగా గుర్తించి చంపటం జరిగిందన్నారు. గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు సూచించారు. -
లాడెన్ డబ్బుతో ఎన్నికల బరిలో షరీఫ్!
ఇస్లామాబాద్: దివంగత పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ని ఎదుర్కొనేందుకు 1990 ఎన్నికల్లో నిలబడేందుకు కావాల్సిన భారీ మొత్తాలను ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ అల్ కాయిదా అధినేత లాడెన్ నుంచి పొందారని ఓ పుస్తకంలో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ ఉన్నతాధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామా ఖలీద్ వెలువరించిన ‘ ఖలీద్ ఖవాజా: షాహీదీ అమాన్’ పుస్తకంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. పాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు షరీఫ్ ప్రతినబూనడంతో ఆయనవైపు లాడెన్, ఖలీద్‌లు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. జియాల తుది దశలో 1990లో పీపీపీని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కావాల్సిన భారీ నగదు మొత్తాలను లాడెన్ నుంచి తీసుకున్నాడని, అధికారంలోకి వచ్చాక షరీఫ్ తన వాగ్దానాలను పక్కనబెట్టాడని ‘డాన్’ వార్తాసంస్థ సోమవారం ఓ కథనం ప్రచురించింది. -
ఉగ్రవాద బీజం అగ్రవాదమే
రెండోమాట అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వాన్ని సోవియెట్ పలుకుబడి నుంచి తప్పించడం కోసం ముజాహిదీన్లకు, లాడెన్ లాంటి వారికి నిధులు సమకూర్చి తిరుగుబాట్లు నిర్వహించింది. అమెరికన్ సామ్రాజ్యవాద 'అగ్రవాదులే' ఆ మాటకొస్తే మధ్యాసియా రిపబ్లిక్కులలో స్థావరం ఏర్పాటు చేసుకోడానికి, ఉక్రేయిన్ లాంటి పాత సోవియెట్ రిపబ్లిక్కులలో తమ అణ్వస్త్రాలను, సైన్యాన్ని తిష్ట వేయించడానికి, అమెరికా పాలకులు ఆఫ్ఘన్ తిరుగు బాటుదార్లకు శిక్షణ ఇవ్వడానికి 1980లలోనే ఒక 'టెర్రరిస్ట్ యూనివర్సటీ' నే సీఐఏ ద్వారా స్థాపించారన్న సంగతి మరచిపోరాదు! 'ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం కేవలం కొన్ని ప్రాంతాలకే, దేశాలకే పరి మితం కాబోవటం లేదు. దూరప్రాంతాలకు కూడా దాని ఉధృతి విస్తరించే విధంగా ఇస్లామిక్ స్టేట్ వ్యూహాన్ని మార్చుకుంది. ఇందుకు తగిన విధంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలకు వెలుపల కూడా తమ శక్తి యుక్తుల్ని పెంచుకున్నారని స్పష్టమైంది. ఈ నూతన బలపరాక్రమాలతో దేశాల ప్రజలపైన మెరుపుదాడుల నిర్వహణకు ఒడిగట్టవచ్చు' - న్యూయార్క్ టైమ్స్ న్యూస్ సర్వీస్ (21-11-2015) అగ్రవాదాన్నీ, ఉగ్రవాదాన్నీ ఎవరూ సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ, మానవాళిని నేడు పీడిస్తున్న ఈ రెండు వాదాలూ ప్రపంచ దేశాల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులనుంచే పుట్టాయి; పెరుగుతున్నాయి. ఆ కారణాలు ఏవీ అన్నదే అసలు ప్రశ్న. నిప్పు లేకుండా పొగరాదు. ఇందుకు 2001 సెప్టెంబర్ 11న (9/11) అమెరికా జంట మహాసౌధాలపైన (ట్విన్ టవర్స్) జరిగిన దాడిలో గాయపడిన ఒక అమెరికన్ మహిళ వేసిన ప్రశ్నేనిదర్శనం! అది అమెరికాలోనే ఒక శేషప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటి? వారు 'మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?' ఆ ప్రశ్నను, ఆమె మాటల్ని మీడియా దేశ ప్రజలకు బట్వాడా చేసింది. ఆనాటి ప్రెసిడెంట్ జార్జి (జూనియర్) బుష్, రాజకీయ వేత్తలు, వ్యాఖ్యాతలూ కూడా అది విన్నారు. ఆ ప్రశ్న ప్రపంచవ్యాపితమ యింది కూడా. ఆ మరుక్షణం నుంచీ సుప్రసిద్ధ అమెరికన్ రచయితలు, టెలివిజన్ ప్రొడ్యూసర్లు మానవ పరిణామ శాస్త్రవేత్తలు మెరిల్ డేవీస్, జియావుద్దీన్ సర్దార్లు పెక్కు రహస్యాలను బయటపెట్టారు. దీనికి తగ్గట్టు గానే 1,500 మంది ప్రసిద్ధ అమెరికన్ మేధావులు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, భూగర్భశాస్త్రవేత్తలు, భవన నిర్మాణ నిపుణులు 'నిజనిర్ధారణ కమిటీ'గా (ట్రూత్ కమిటీ) ఏర్పడి మరికొన్ని విషయాలు వెల్లడిస్తూ, టవర్స్‌ను కూల్చిన దుర్మార్గంపై విచారణకు అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు వగైరా మేధావులతో కూడిన ప్రత్యేక కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. డెన్నిస్ చెప్పిన సత్యాలు ఒక మతాన్ని అవలంబించే వారంతా ఉగ్రవాదులూ కారు, ఉగ్రవాదు లందరూ మతావలంబికులూ కానక్కర్లేదు. వారిలో కూడా హేతువాదులూ, మానవతావాదులూ ఉంటారని అమెరికన్ పార్లమెంటులో క్లీవ్‌లాండ్ డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధి డెన్నిస్ కూసినిక్ ఈ దుర్ఘటన గురించి కాలిఫోర్నియా అమెరికన్ల సభలో పేర్కొంటూనే, కొన్ని సత్యాల్ని బహిర్గతం చేశాడు. అమెరికా రాజ్యాంగాన్ని, బహిరంగ విచారణకు రాజ్యాంగం కల్పిస్తున్న మాండేట్ను పాలకులకు గుర్తు చేస్తూ, అమెరికా ప్రజల పేరిట, వారి ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే, వారి అనుమతి లేకుండానే పాలకులు తీసుకుంటున్న తప్పుడు చర్యల్ని, నిర్ణయాలను శఠిస్తూ, ప్రజల అనుమతి లేకుండా పాలకులు చేసే నిర్ణయాలను ఒక్కటొక్కటిగా పేర్కొంటూ కడిగిపారేశాడు. ఆ 'చాకిరేవు' ఏమిటో చూడండి: 'ఇరాక్‌పైన దాడులకు మనం (అమెరికన్లం) అనుమతి ఇవ్వలేదు; ఇరాన్‌పై మన దురాక్రమణ చర్యలకు మన అనుమతి లేదు; ఉత్తర కొరియాపై దాడికి మన అంగీకారం లేదు; అఫ్ఘానిస్తాన్‌లో పౌరులపై బాంబు దాడులకు మన అంగీకారం లేదు; ఇరాక్ పేరుతో గ్వాంటనామా అఘాతంలో కాన్సెన్ట్రేషన్ క్యాంపులో శాశ్వతంగా డిటెన్యూలను కుక్కమని పాలకులకు మనం అధికారం ఇవ్వలేదు. జెనీవా ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకోవడానికి మనం అనుమతి ఇవ్వలేదు; పౌరుల్ని న్యాయచట్టాల అమలులో అనుసరించాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియకు వ్యతిరేకంగా మిలటరీ ట్రిబ్యునళ్లను పెట్టడానికి గాని, డిటెన్యూలు తమ విచారణకు, విడుదలకు వీలుకల్పించే హెబియస్ కార్పస్‌ను రద్దు చేయడానికి గాని ప్రజలు అనుమతి ఇవ్వలేదు; ప్రత్యర్థులను హత్యగావించే స్క్వాడ్స్‌ను నిర్వహించేందుకు ప్రజల నుంచి అనుమతి పొందలేదు; దేశీయ గూఢచారిశాఖ (ఎఫ్‌బీకే) దేశీయ వామపక్ష, రాడికల్ సంస్థలపైన గాని భిన్నాభిప్రాయం ప్రకటించే రాజకీయ ప్రత్యర్థులపై గాని గూఢచర్యపు కార్యకలాపాలను గాని నిర్వహించడానికి పాలకులు ప్రజానుమతి పొందలేదు; ప్రజా హక్కుల బిల్లును (బిల్ ఆఫ్ రైట్స్) రద్దు చేసేందుకు ప్రజల అనుమతి పొందలేదు. రాజ్యాంగాన్ని ఆచరణలో పక్కన పెట్టేందుకు, పాలకులు ప్రజల అనుమతినీ పొందలేదు; నగరాలలో ఏం జరుగుతుందో కూపీ లాగేందుకు కెమెరాల ద్వారా ప్రెసిడెంట్ తెలుసుకోవడానికి ప్రజలు అనుమతి ఇవ్వలేదు. 'కంటికి కన్ను' అనే గూఢచర్య కార్యకలాపాలకు ప్రజలు అనుమతి ఇవ్వలేదు; సెప్టెంబర్ 11న దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రతీకారంగా అఫ్ఘానిస్తాన్‌లోని అమాయక గ్రామీణ ప్రజల రక్తంతో పరిహారం చెల్లించడానికి ప్రజల అనుమతి పొందలేదు; ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, తనకు ఇష్టమొచ్చిన రీతిలో యుద్ధం ప్రకటించడానికి మనం పాలక వర్గానికి అధికారం ఇవ్వలేదు; యుద్ధాన్ని అంతూ పొంతూ లేకుండా కొనసాగించడానికి మన ప్రజలు అనుమతివ్వ లేదు; అలా అని శాశ్వత యుద్ధ ఆర్థికవ్యవస్థ ఏర్పాటుకూ ప్రజలు అనుమతి ఇవ్వలేదు.' అణచివేత నుంచే ఆగ్రహ జ్వాలలు అలాంటి పాలకవర్గాలు, ప్రభుత్వాలు సమాజంలో దోపిడీవ్యవస్థకు, పెట్టు బడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రజలలో అలజడికి, అశాంతికి కారణమవుతున్నం దువల్లనే నిత్యం బాధలు పడే ప్రజాబాహుళ్యం నుంచే ప్రతీకార జ్వాలలు పుట్టుకొస్తాయి. అవి కొన్నిచోట్ల తీవ్రమైన నిరసనలకు, ప్రతిఘటనలకు; మరికొన్ని చోట్ల తిరుగుబాట్లకు, ఇంకా- అట్టుడికి పోతున్న సమాజంలో ప్రత్యక్ష విప్లవాలకు, ఇంకొన్ని చోట్ల ఉగ్రవాద చర్యలకు కారణమవు తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థల రక్షణకు సామ్రాజ్యవాద ప్రభుత్వాలు అండదండలు అందిస్తూ ఉంటాయి. పెట్టుబడులపై విపరీత లాభాల కోసం ఇతరదేశాల ఆక్రమణలకు, అక్కడి సహజ వనరులను, ఆయిల్ సంపదను దోపిడీ చేసి, స్థానిక ప్రజలను బికారులుగా మార్చి తమపై ఆధారపడి బతికే స్థితికి ఆంగ్లో-అమెరికన్, బ్రిటిష్, ఫ్రెంచి సామ్రాజ్యవాద వ్యవస్థలు తీసుకువచ్చినందుననే - అగ్రవాద రాజకీయానికి సమాధానంగానే ఉగ్రవాద రాజకీయం విజృంభించి, ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలు తమ ఉనికి కోసం రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారని గ్రహించాలి. ఈ అగ్రవాద వ్యవస్థలకు కొన్ని నూతన స్వతంత్ర దేశాలు కూడా ఆర్థిక సాయం కోసమో సైనిక సహాయం కోసమో అర్రులు చాస్తూ తమ ఇరుగు పొరుగు దేశాలతో సహజీవన సూత్రానికి విరుద్ధమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నాయి! ‘నేను ఫలానా వాడు ఉగ్రవాది అని ప్రకటిస్తే అందుకు తోడుగా అనుకూలంగా గొంతు విప్పని ప్రభుత్వాలను, ఉగ్రవాదులుగానే ప్రకటిస్తానని’ అమెరికా అధ్యక్షులు బెది రిస్తే చాలు లొంగి సలాము కొట్టిన నేతలు ఉన్నంత కాలం - ఇటు అగ్రవా దాన్నీ అటు ఉగ్రవాదాన్నీ అదుపులోకి తేవడం దుస్సాధ్యమవుతోందని గ్రహించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసుకోవలసిన అవసరం ఉంది. ఆ పాపం అమెరికాదే ట్విన్ టవర్స్ దుర్ఘటనను సాకుగా తీసుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు ‘అగ్రరాజ్య దుష్టచతుష్టయం’ అండగా ఇరాక్, అఫ్ఘానిస్తాన్ సెక్యులర్ వ్యవస్థలను కూలదోశారు. సద్దాం హుస్సేన్ (ఇరాక్) గడాఫీ (లిబియా) లాంటి జాతీయవాదుల్ని, అంతకుముందు దశాబ్దాలలో మొసాదిక్, నజీబుల్లా లాంటి నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని సెక్యులర్ ప్రభుత్వాన్ని సోవియెట్ పలుకుబడి నుంచి తప్పించడం కోసం ముజాహిదీన్లకు, బిన్ లాడెన్ లాంటి వారికి నిధులు సమకూర్చి తిరుగుబాట్లు నిర్వహించింది అమెరికన్ సామ్రాజ్యవాద ‘అగ్రవాదులే’. ఆ మాటకొస్తే మధ్యాసియా రిపబ్లిక్కులలో స్థావరం ఏర్పాటు చేసుకోడానికి, ఉక్రేయిన్ లాంటి పాత సోవియెట్ రిపబ్లిక్కులలో తమ అణ్వస్త్రాలను, సైన్యాన్ని తిష్ట వేయించడానికి, అమెరికా పాలకులు ఆఫ్ఘన్ తిరుగు బాటుదార్లకు శిక్షణ ఇవ్వడానికి 1980లలోనే ఒక 'టైస్టు యూనివర్సటీ'నే సీఐఏ ద్వారా స్థాపించారన్న సంగతి మరచిపోరాదు! ఆ రోజుల్లో అమెరికా తరఫున తైనాతీలుగా వ్యవహరిస్తున్న ఒసామా బిన్ లాడెన్ అమెరికా ‘పే-రోల్’లోనే ఉన్నాడని 1998లోనే అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి విలియం కోహెన్ ప్రకటించాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1890లలో సౌత్ డకోటాలో నివసించే భారతీయులపై అమెరికా సాగించిన దాడులతో, హత్యాకాండతోనే ప్రారంభమైన సంగతీ మరువలేనిది! ఒకటేమిటి, నాటి నుంచి నేటిదాకా - ప్రపంచంలోని సుమారు 80-90 దేశాలలో అమెరికా తన ప్రపంచాధిపత్యాన్ని కాపాడుకోవడానికి నౌకా, మిలిటరీ, విమాన స్థావరా లను, సైన్యాన్ని నిలిపి ఉంచింది. ఈ మందీ మార్బలం అంతా ఇటలీ, లెబనాన్, ఇండోనేసియా, వియత్నాం, గయానా, జపాన్, నేపాల్, లావోస్, బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్స్, బొలీవియా, గ్వాటమాలా, చిలీ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, క్యూబాలలో తన తైనాతీ పాలకుల్ని నిలపడం కోసం ఎన్నికలను, ప్రజాస్వామిక ప్రక్రియలను తారుమారు చేయడానికి అనేకసార్లు ప్రయత్నించింది. ఐక్యరాజ్య సమితిని ‘డమ్మీ’ సంస్థగా చూస్తోంది. ఈ అన్ని దేశాలలో లక్షల, కోట్ల మంది ప్రజాబాహుళ్యం అమెరికా పాలకుల కుట్రలకు, దాడులకు బలైపోయారని, ఉగ్రవాదులకు అగ్రవాద రాజ్య చర్యలే ఉసురు పోస్తున్నాయని గ్రహించాలి. అమెరికా తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పూర్తిగా ఉపసం హరించుకుని, దేశాల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించడమే ఉగ్రవాదానికి పరిష్కారం. abkprasad2006@yahoo.com.in సీనియర్ సంపాదకులు:ఏబీకే ప్రసాద్ -
నేను లాడెన్‌ను.. నేను రాముడ్ని!
హైదరాబాద్: ‘నేను ఒసామా బిన్ లాడెన్‌ను.. నేను రాముడ్ని.. నేనే దేవుడ్ని..’ అంటూ గురువారం ఉదయం హైదరాబాద్ కోఠిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ వద్ద ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్‌కుమార్(35) కొన్నేళ్లుగా నగరంలోని చప్పల్‌బజార్‌లో నివాసం ఉంటూ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని దేనా బ్యాంక్‌లో అకౌంట్స్ ఉన్నతాధికారిగా పని చేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో బ్యాంక్ అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. గురువారం ఉదయం కోఠి గాంధీ జ్ఞాన్ మందిర్ వద్దకు వచ్చిన రామ్‌కుమార్.. ఇనుప రాడ్‌ను పట్టుకుని అక్కడ రోడ్డుపై వెళ్తున్న ప్రజలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో టోలీచౌకికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సమీఉద్దీన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుస్టేషన్‌లోనూ అతడు వీరంగం సృష్టించాడు. దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబడి.. నేను దేవుడ్ని.. వెల్ ఎడ్యుకేటెడ్ని అని అరుస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి 20 మంది పోలీసులు కలసి అతడికి బేడీలు వేసి కట్టడి చేశారు. -
దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్
పనాజీ:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ కు చెందిన మరో అనుచరుడ్ని తాజాగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుడు శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్(50) ఆదివారం పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగో పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వలపన్ని అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి కశ్యప్ తెలిపారు. ఆనాటి ముంబై పేలుళ్లలో 250 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దావూద్ గ్యాంగ్ చెందిన పలువురు వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నారు. -
దావూద్‌ను పట్టుకునే ధైర్యం కేంద్రానికుందా ?
నిలదీసిన శివసేన ముంబై : అల్‌ఖాయిదా అధినేత లాడ్న్ను మట్టుపెట్టేందుకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్ తరహా చర్యల ద్వారా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉందా అని శివసేన సోమవారం ప్రశ్నించింది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన తన అధికారరిక పత్రిక ‘సామ్నా’ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించింది. కరుడు గట్టిన తీవ్రవాదులు హఫీజ్ సయ్యద్, దావూద్ వంటి వారు పాకిస్తాన్లో రాజకీయ రక్షణతో ప్రశాంతంగా జీవిస్తున్నారంది. పాకిస్తాన్లో దలదాచుకుంటున్న ఉగ్రవాదులకోసం పలుమార్లు అర్థించాల్సిన అవసరం లేదనీ ఒసామా బిన్లాడ్న్ను పట్టుకునేందుకు అమెరికా అనుసరించిన విధానం మన ప్రభుత్వం చేయాలని సూచించింది. -
త్రీమంకీస్ - 65
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 65 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఒబామా, బిన్ లాడెన్లు నా కోసం నక్కబొక్కలపాడులో ఎదురు చూస్తూంటారు. నేను గాడిదని ఎక్కి విమానాశ్రయానికి వెళ్ళాలి. అక్కడ విమానాన్ని లాగడానికి రోడ్డింజను సిద్ధంగా ఉందా?...’’ ‘‘మా వాడ్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇన్ని రోజులు మీరు ఏమయ్యారు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాస్త్తిక మహాసభలకి వెళ్ళి ఇవ్వాళే వచ్చాను.’’ ‘‘మీ పేరు?’’ ‘‘రామదాసు’’ ఆయన చెప్పాడు. ‘‘మనం వెంటనే కవాడీగూడా స్మశానానికి వెళ్ళాలి’’ రుధిర ఇంట్లోంచి బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు. ‘‘అరె పాపం? వానర్‌కి ఏమైంది? ఇంకా సర్దుకోలేదా?’’ మర్కట్ ఆందోళనగా అడిగాడు. ‘‘ఏమీ కాలేదు. పోలీసులు మన కోసం వెదకని చోటు అదే. మనం అక్కడ ఉన్నామని తెలిసినా కొద్దిసేపట్లో కాల్చేస్తారనుకుని రారు. ఎక్కడో ఓ చోట దాక్కోవాలిగా’’ కపీష్ సూచించాడు. ‘‘మనం మా బాబాయ్ ఇంటికి వెళ్ళచ్చు. ఆయన శబరిమలైకి వెళ్ళాడు. మరో పది రోజుల దాకా రాడు. ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీ పిన్నమ్మ వంట బావుండదా?’’ ‘‘పిన్నమ్మ ఏనాడో టపా కట్టింది. ఇంటి తాళం చెవి నా దగ్గర లేదు.’’ ‘‘పిల్లల్ని అడిగి తీసుకో.’’ ‘‘ఒకరు విజయవాడ గాంధీనగర్‌లోని మేకా వారి వీధిలో, ఇంకొకరు సత్యనారాయణపురం లోని సింహాల మేడలో ఉంటున్నారు. ఇద్దరికీ ఉప్పూ నిప్పూ. ఒకరు ఉండగా ఇంకొకరు రారు.’’ ‘‘తాళం చెవి సంగతి నాకు వదులు. రేపు రైట్ టైం షాప్ తలుపు తాళాన్ని కూడా తెరవాల్సింది నేనేగా. ఆయనుండేది ఎక్కడ?’’ కపీష్ అడిగాడు. ‘‘కొంతకాలం సైనికుడిగా పనిచేసి సైనిక్‌పురిలో ఉన్నాడు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వస్తే అక్కడ చేరి వాయుపురిలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ నేవీలో ఉద్యోగం వస్తే అందులో చేరి రిటైరవబోయే ముందు పానీపురిలో ఇల్లు కొనుక్కున్నాడు.’’ మర్కట్ బాబాయ్ ఇంటి తలుపుని కపీష్ ఆట్టే శ్రమపడకుండానే తెరవగలిగాడు. ముందుగా ముగ్గురూ ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి చూస్తే అందులో వారు ఆశించిన కోక్ బాటిల్ లేదు. వెతికితే డబ్బు ఎక్కడా కనపడలేదు కాని అదృష్టవశాత్తు ఓ కార్టన్‌లో ఆరు కోక్ జీరో ఫోర్ హండ్రెడ్ మిల్లీలీటర్ల పెట్ బాటిల్స్ కనిపించాయి. వాటిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాడు కపీష్. ‘‘ఇవాళ మనకి చాలా బిజీ డే. డబ్బు కోసం ఏం అమ్ముదాం?’’ వానర్ ఇంట్లోని వస్తువులని చూస్తూ మిత్రులని సలహా అడిగాడు. ‘‘అన్నీ అమ్మినా రెండు వేలు కూడా రావు.’’ మర్కట్ విచారంగా చెప్పాడు. ‘‘ఐడియా.’’ ‘‘ఏమిటి?’’ ‘‘మేమోసారి ఏభై రూపాయలు మోసపోయాం. అదే ఇప్పుడు మనకి శ్రీరామరక్ష. మనకి కొన్ని ప్రింటవుట్స్ కావాలి’’ కపీష్ డిక్టేట్ చేస్తూంటే వానర్ దాన్ని వర్డ్‌లో టైప్ చేశాడు. గంటన్నర తర్వాత ముగ్గురూ మూడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల్లోకి వెళ్ళి డోర్ బెల్స్ నొక్కారు. తలుపు తెరిచిన మహిళల వంక చూసి నవ్వి చెప్పారు. ‘‘గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రీ హోమ్ లైబ్రరీ నించి వస్తున్నాం. నెలకి అరవై రూపాయలు ఇస్తే మీకీ పుస్తకాలన్నీ ఇంటికే తెచ్చిచ్చి, మళ్ళీ తీసుకెళ్తాం.’’ వాళ్ళు ఆ కాగితం చదివారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అరవం పత్రికల లిస్ట్, ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల నవలల లిస్ట్ అందులో ఉన్నాయి. ‘‘ఉదయం మీకు సౌకర్యమా మేడం? లేక సాయంత్రమా? ఏ మేగజైన్ ఏరోజు కావాలో టిక్ చేయండి. ఇవాళ ఏం కావాలి?’’ ‘‘గృహశోభ ఉందా?’’ ‘‘ఉంది. మీరు ఏ రోజైనా బుక్ తీసుకోకపోతే రెండు ఛాయిస్‌లు. మర్నాడు రెండు తీసుకోవచ్చు. లేదా ఆ రోజు ఎమౌంట్ తర్వాతి నెల దాంట్లో కట్ చేసుకుని మిగిలింది ఇవ్వచ్చు.’’ చాలామంది మహిళలు పుస్తకాలు చదవకపోవడానికి కారణం అవి అందుబాటులో లేకనే. ఒకప్పడు రెంట్ కార్నర్స్ నించి వాటిని తీసుకుని చదివేవారు. ఇప్పుడవి నాస్తి. నలభై పైబడ్డ మహిళల్లో ప్రతీ నలుగురిలో ఒకరే రిజెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురూ అరవై చొప్పున డిపాజిట్ చెల్లించారు. ‘‘పుస్తకాల బేగ్ కింద బండిలో ఉంది. మీకు గృహశోభ కావాలన్నారా? తెచ్చిస్తాను’’ చెప్పి డబ్బు తీసుకుని వాళ్ళు ఉడాయించసాగారు. ‘‘నే చెప్పలా? నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఒక్కరూ మనల్ని గుర్తు పట్టలా. ఓసారి టీవీలో ఫొటోని అలా చూపించినంత మాత్రాన గుర్తుంచుకుని పోలీసులకి మన గురించి ఇన్ఫాం చేసే మహిళలు మన తెలుగు గడ్డ మీద ఎవరున్నారు?’’ కపీష్ చెప్పాడు. ముగ్గురూ ఆ మోసంతో సంపాదించిన డబ్బుని లెక్క పెట్టారు. ఎనిమిది వేల ఆరు వందల చిల్లర. ‘‘గుడ్. మనకి అవసరమైనవి ఇక కొనచ్చు’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురూ మర్కట్ బాబాయ్ ఇంట్లోంచి బయటకి నడుస్తూంటే ఓ శవం ఎదురొచ్చింది. -
మోడీపై ‘బీహార్ లాడెన్’ పోటీ.
‘బీహార్ లాడెన్’గా పేరు పొందిన మీరజ్ ఖలీద్ నూర్ ఈ ఎన్నికల్లో నేరుగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు నూర్ ప్రకటించారు. చాలా ఆలోచించాక మోడీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. పాట్నాకు చెందిన నూర్ గత ఎన్నికల్లో ఆర్జేడీ, ఎల్జేపీలకు అస్మదీయుడిగా ఉండేవారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఎల్జేపీ అధినేత పాశ్వాన్లు ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న నూర్‌ను ప్రచార సభలకు తీసుకు వెళ్లేవారు. లాడెన్ మరణం తర్వాత వారు నూర్‌ను పట్టించుకోవడం మానేశారు. దీంతో నూర్ సొంతగా ‘రామ్ ఇండియా’ పేరిట సొంత పార్టీని ప్రారంభించారు.