పాక్ వల్లే చర్చలకు విఘాతం
పాక్ వల్లే చర్చలకు విఘాతం
Published Fri, Jun 2 2017 2:49 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: భారత్, పాక్ దేశాల మధ్య చర్చలకు అనువైన వాతావరణాన్ని పాకిస్తాన్ చెడగొట్టిందని ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. కశ్మీర్‌లో పరిస్థితులు అనుకుంటున్న దాని కన్నా మెరుగ్గానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్ ఎన్నో చర్యలు తీసుకుందని, అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రదాడులకు పాల్పడిందని దుయ్యబట్టారు. ఉడీ, పఠాన్‌కోట్ దాడులు, ఇద్దరు భారత సైనికుల తలలు నరకడాన్ని ఇందుకు ఉదాహరణగా వివరించారు.
చొరబాట్లు తగ్గాయి: రాజ్‌నాథ్
నియంత్రణ రేఖ వెంట భారత సైన్యం సర్జికల్ దాడులు జరిపిన తరువాత ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గుముఖం పట్టాయ ని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నా రు. సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా వినియోగించుకోవద్దని బలగాలకు సూచించా రు. శిక్షణ పూర్తిచేసుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్ల నియామక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కొందరు అధికా రులు టోపీలు ధరించకపోవడం, షూ లేస్‌లు కట్టుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆత్మీయ ఆలింగనం
అవార్డుల ప్రదాన సమయంలో రాజ్‌నాథ్ ప్రొటోకాల్‌ను తోసిరాజని, ఉగ్రదాడిలో 85 శాతం అంగవైకల్యం పొందిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ గోధ్రాజ్ మీనాను కౌగిలించుకున్నారు. మీనాకు రాజ్‌నాథ్ శౌర్య పతకాన్ని బహూకరించిన సమయంలో చప్పట్లు మార్మోగాయి. మీనా సెల్యూట్ చేయడానికి ముందే రాజ్‌నాథ్ ఆయన్ని హత్తుకుని శభాష్ అని పొగిడారు. వేదిక చివరి వరకు వచ్చి ఆయన్ని సాగనంపారు. 2014 ఆగస్టు5న ఉధంపూర్‌లో సైనికుల వాహనంపై మిలిటెంట్లు దాడి చేసినపుడు మీనా గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మిలిటెంట్లు బస్సులోకి రాకుండా అడ్డుకుని 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడారు. ఈ క్రమంలో మిలిటెంట్ల కాల్పుల్లో మీనా తీవ్రంగా గాయపడ్డారు.
Advertisement
Advertisement