Published
Sat, Jun 4 2016 5:58 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న మెర్సిడైస్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్ చేసిన సమయంలో బాల నేరస్తునిగా ఉన్న ఓ కుర్రాడు ప్రస్తుతం మేజర్ కావడంతో అతన్ని ట్రయల్ కోర్టులో విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు ఢిల్లీ పోలీసులకు అనుమతినిచ్చింది.
ఈ కేసులో మైనర్ గా ఉన్న నేరస్ధుడు ఏప్రిల్ 4 న ఢిల్లీలో కారు డ్రైవింగ్ చేస్తుండగా సిద్ధార్థ శర్మ(32) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆక్సిడెంట్ జరిగిన నాలుగు రోజుల తర్వాత అతను మేజర్ అవుతాడని, కేసును నమోదు చేసేప్పుడు ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని చార్జిషీట్ లో నమోదు చేశారు. నేరస్థనిపై దోషపూరిత హత్యగా కేసును నమోదు చేశారు. నిందితుని తండ్రి, డ్రైవరుపై కూడా కేసును నమోదు చేశారు. అప్పుడు నేరస్థుడు మైనర్ కావడంతో అతనికి బెయిల్ లభించింది. ప్రస్తుతం అతన్ని మేజర్ గా గుర్తించాలని పోలీసులు విజ్ఞప్తిని జువైలిన్ బోర్డు అంగీకరించడంతో హత్య గా కేసును నమోదు చేసిన పోలీసులు మళ్లీ నిందితున్ని అరెస్టు చేయనున్నారు.