ప్రయాణం ఇంకా హాయిగా | Delhi-Noida pact soon to widen Shahdara drain bridges | Sakshi
Sakshi News home page

ప్రయాణం ఇంకా హాయిగా

Published Mon, Aug 11 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ప్రయాణం ఇంకా హాయిగా

ప్రయాణం ఇంకా హాయిగా

 న్యూఢిల్లీ: ఢిల్లీ-నోయిడాలమధ్య రాకపోకలు సాగించేవారికి శుభవార్త. షహదారా మురుగుకాల్వపై ప్రస్తుతమున్న నాలుగు లేన్ల రహదారి త్వరలో ఎనిమిది లేన్లు కానుంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ వరద నియంత్రణ విభాగం, నోయిడా సంస్థల మధ్య త్వరలో ఓ ఒప్పందం కుదరనుంది. ఈ విషయాన్ని నోయిడా చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ ఎ.కె.గోయల్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం, తాము కలసి ఇందుకు నిధులను కేటాయిస్తామన్నారు. తాము 33 శాతం నిధులను విడుదల చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనులకు రూ. 50 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామన్నారు. ఈ మార్గంలో కొత్తగా మూడు వంతెనల విస్తరించనున్నామన్నారు.
 
 ఇందుకు  రూ. 15 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. ఓఖ్లా వంతెన వద్ద విస్తరణ పనులు ఏడాదిన్నర తర్వాత ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగిపోయిందని, వంతెనల విస్తరణ పనులు పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వాహనాల రద్దీ పెరగడాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ ప్రాజెక్టుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. కాగా ఢిల్లీలోని చిల్లా రెగ్యులేటర్ వద్ద ప్రారంభమయ్యే షహదారా డ్రెయిన్ నోయిడాలోని సెక్టార్ 14 ఏ వద్ద ముగుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement