
భార్య అలాచేయడం క్రూరత్వం కాదు: హైకోర్టు
భార్య తనతో శృంగారానికి నిరాకరించినందుకు గాను విడాకులు కావాలంటూ కోర్టుకెళ్లిన ఓ వ్యక్తికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.
న్యూఢిల్లీ: భార్య తనతో శృంగారానికి నిరాకరించినందుకు గాను విడాకులు కావాలంటూ కోరిన ఓ వ్యక్తికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. శృంగారానికి నిరాకరించిన సదరు భార్య ఆ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉంది కావున ఇందులో క్రూరత్వం ఏమీ లేదని.. ఈ కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే.. భార్య ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, నిద్రలేస్తూనే టీ తీసుకురావాలని ఆర్డర్‌లు వేయడం ఆమె సోమరితనాన్ని సూచిస్తాయి కానీ క్రూరత్వాన్ని కాదని పిటిషనర్ ఆరోపణలపై కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కారణాలతో విడాకులు ఇవ్వడం కుదరదని గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును జస్టీస్ ప్రదీప్ నంద్రజోగ్, ప్రతిభా రాణీలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.