అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం... | Development of north-east must for overall growth: Amit Shah | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం...

Published Tue, Sep 5 2017 4:25 PM | Last Updated on Mon, May 28 2018 4:01 PM

అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం... - Sakshi

అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం...

 న్యూఢిల్లీః సుదీర్ఘ కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో  మోదీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో వృద్ధి అనివార్యమన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ) సదస్సులో అమిత్‌ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయి వంటిదని పేర్కొన్నారు. 
 
ఎన్‌ఈడీఏ రాజకీయ వేదికే కాకుండా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల సంస్కృతికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. తదుపరి ఎన్‌ఈడీఏ భేటీలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశానికి అస్సాం, మణిపూర్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ సీఎంలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement