ఇంతకంటే ఏమి కావాలి | Devendra Fadnavis mother sarita | Sakshi
Sakshi News home page

ఇంతకంటే ఏమి కావాలి

Published Thu, Oct 30 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

ఇంతకంటే ఏమి కావాలి

ఇంతకంటే ఏమి కావాలి

కొడుకు సీఎం అవడంపై దేవేంద్ర తల్లి సరిత
సాక్షి, ముంబై: ‘కొడుకులు ప్రయోజకుడైతే ముందుగా సంతోషించేది కన్నవారే. అందులోనూ నా కుమారుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంకంటే సంతోషం ఇంకేముంది’ అంటూ దేవేంద్ర ఫడణవిస్ తల్లి సరితా ఫడణవిస్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర పేరు ప్రకటించగానే నాగపూర్‌లో మంగళవారం సాయంత్రం ఆయన అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్న సంగతి విదితమే.

ఈ సంగతి తెలిసినవెంటనే దేవేంద్ర తల్లి సరిత మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర, రాష్ట్రంలో దేవేంద్ర అంటూ  ముందుగా ప్రకటించిన విధంగానే జరిగిందన్నారు. ‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని అందరూ కోరుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తన  కుమారుడికి కూడా మంత్రి పదవి లభించొచ్చని అనుకున్నాం. అయితే ఏకంగా ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం అనుకోలేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తప్పకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తాడు’ అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేవేంద్ర పట్టుదలకు మారుపేరని, అనుకున్నది సాధించి తీరుతాడంటూ కితాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement