డీజిల్‌పై 50 పైసలు పెంపు | Diesel price hiked by 50 paise | Sakshi
Sakshi News home page

డీజిల్‌పై 50 పైసలు పెంపు

Published Sun, Dec 1 2013 1:56 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

డీజిల్‌పై 50 పైసలు పెంపు - Sakshi

డీజిల్‌పై 50 పైసలు పెంపు


 పెట్రోలు ధర యథాతథం
  న్యూఢిల్లీ: దేశంలోని చమురు సంస్థలు డీజిల్ ధరలను లీటరుకు 50 పైసల మేరకు పెంచాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. డీజిల్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది పదకొండోసారి. స్థానిక పన్నులు, ‘వ్యాట్’తో కలుపుకుంటే ఢిల్లీలో డీజిల్ ధర లీటరుపై 57 పైసలు పెరిగి, రూ.53.67కు చేరుకుంటుంది. ముంబైలో ఈ ధర రూ.60.08 నుంచి రూ.60.70కి పెరుగుతుంది. అయితే, ప్రస్తుతానికి పెట్రోలు ధరలను యథాతథంగానే ఉంచాలని చమురు సంస్థలు నిర్ణయించుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం.
 
 అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వల్ల పెట్రోలు ధరను లీటరుకు 25-30 పైసల మేరకు పెంచాల్సిన పరిస్థితి ఉన్నా, ఈ భారాన్ని వినియోగదారులపై మోపరాదని చమురు సంస్థలు నిర్ణయించుకున్నాయి. డీజిల్ విక్రయాల వల్ల చమురు సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లుతుండటంతో, నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రతినెలా స్వల్ప మొత్తాల్లో డీజిల్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ జనవరిలో చమురు సంస్థలకు అనుమతులు ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement