దాదర్/భివండీ, న్యూస్‌లైన్ : 2014-2015 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన సర్వ సాధారణ ‘బడ్జెట్’ పై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు
వారి మాటల్లోనే..
సంతృప్తికరంగానే ఉంది
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తి కరంగానే ఉంది. సామాన్యులతోపాటు అందరిని అనుకూలంగా ఉంది. లగ్జరీ వస్తువుల ధరలు పెరిగాయి, నాన్ లగ్జరీ వస్తువుల తగ్గనున్నాయి. రూ. రెండు లక్షల వరకు ఉన్న పన్ను రాయితీని రూ.రెండున్నర లక్షల వరకు పెంచారు. మౌళిక సదుపాయాలు, భద్రతా, విద్యా, ఇలా అన్ని రంగాలకు బడ్జెట్ సమతుల్యంగా ఉంది.-అశోక్ రాజ్‌గిరి సీఏ చార్టెడ్ అకౌంట్, ముంబై
నిరాశపరిచింది
ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ‘బడ్జెట్’ అంత ఆశాజనకంగా లేదు, పూర్తి అసంతృప్తి కలిగించింది. కొత్త దనం లేదు. ఆదాయపు పన్ను, ప్రకటించిన ఇతర కొన్ని రాయితీలు మధ్య తరగతి ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించాయి. పూర్తిగా న్యాయం జరిగేలా లేదు. సాదాసీదాగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.-మాదిరెడ్డి కొండారెడ్డి (ప్రధాన కార్యదర్శి తెలుగు కళాసమితి, వాషి
పాతసీసాలో కొత్తసారా
ఈ బడ్జెట్ పాత సీసాలో కొత్త సారాలా ఉంది. యూపీఏకు ఎన్‌డీఏ బడ్జెట్‌లకు తేడా ఏమాత్రం కనిపించలేదు. దొందు దొందే. బలహీన వర్గాలను, రైతుల సమస్యలను పట్టించుకోలేదు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంతో ఇది సామాన్యులపై ఏమాత్రం ప్రభావం చూపనుందో, ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు కలిగిస్తుందో చూడాలి. -మచ్చ ప్రభాకర్, రచయిత, ముంబై
మోడీ మార్క్ కోసం వేచిచూడాల్సిందే
గత ప్రభుత్వాలు చేపట్టిన ఆర్థిక అవకతవకలను అధిగమించేందుకు, ప్రస్తుతం ఉన్న ఆర్థికవనరులను అనుసరించి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యులకు వెంటనే లాభాలు, అనేక ఇతర సౌకర్యాలు అందించే అవకాశాలు కలగలేదు. నిజంగా ‘నరేంద్ర మోడీ’ మార్క్ ప్రజోపకరమైన బడ్జెట్ రావాలంటే మరో మూడు, నాలుగు ఆర్థిక సంవత్సరాలు వేచి చూడాల్సిందే. -సంకు సుధాకర్, అధ్యక్షుడు, ది బొంబాయి ఆంధ్ర మహాసభ
మిశ్రమ ఫలితాలు
పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మిశ్రమ ఫలితాలు కలిగి ఉంది. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని ప్రకటించిన బడ్జెట్‌లో కొన్ని అంశాలు ఊరట కలిగించ వచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలను రైల్వేబడ్జెట్ నిరాశపరిచింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రైతుల రుణాల మాఫీ గురించి ఈ బడ్జెట్‌లో ప్రస్తావించక పోవడం మరింత నిరాశకు గురిచేసింది. -పోతు రాజారాం, (ట్రస్టీ సభ్యుడు, ది బొంబాయి ఆంధ్ర మహాసభ
సానుకూల బడ్జెట్
మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలకు బడ్జెట్ సానుకూలంగా ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్‌ఈజడ్)ను ఆమోదించలేదు. మోడీ హయాంలో అమలు అవుతాయని భావిస్తున్నాం. గతంలో భివండీలోని కాలేర్, కశేలీ, కేవిని దివేకు ఇట్టి జోన్‌లుగా పరిగణించారు. ప్రస్తుతమిచ్చిన 7 నగరాలలో భివండీకి అవకాశం ఇస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.-వెంకటేశ్, చిటికెన్, న్యాయవాది
రాజకీయాలకతీతం
మోడీ ప్రభుత్వంలో మొట్ట మొదటి సారిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ సర్వసాధారణంగా, మధ్యంతరంగా ఉంది. ఎలాంటి రాజకీయాలు చేయకుండా అందరికి సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వృద్ధులకు రూ. 1000 పింఛన్‌లు అమలు చేశారు. అర్హులకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మున్ముందు ప్రతి సిటీలో నిమ్స్ ఆసుపత్రుల సదుపాయాలు కల్పించాలి. -అడ్డగట్ల దత్తాద్రేయ, పారిశ్రామిక వేత్త
కొంచెం తృప్తి..కొంచెం అసంతృప్తి
Published Fri, Jul 11 2014 11:49 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement