ఫిరోజ్‌పూర్ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పది మంది ప్రాణాలు కాపాడుతూ.. ఎంతో దయా హృదయంలో మెలగాల్సిన ఓ డాక్టర్, మహిళను జుట్టు పట్టి కొట్టాడు. ఈ మొత్తం సంఘటన కెమెరాకి చిక్కింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.
మహిళ జుట్టు పట్టి కొడుతూ కుషాల్‌దీప్ సింగ్ అనే డాక్టర్, ఆమెను వార్డు నుంచి ఆసుపత్రి ప్రవేశం వరకు తీసుకొచ్చాడు. పక్కనే పోలీసులు ఉన్న వారేమి చేయకుండా.. అలానే నిల్చుని ఉండిపోయారు. మధ్యమధ్యలో వారించిన పెద్దగా ఆ డాక్టర్‌ను ఏం చేయలేకపోయారు. ఇద్దరు పోలీసు అధికారుల ముందే ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని సోషల్ మీడియా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన అథారిటీలు ఈఎన్‌టీ నిపుణుడైన కుషాల్‌దీప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. డాక్టర్‌కు వ్యతిరేకంగా కేసును రిజిస్ట్రర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment