ferozepur
-
ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీపై బదిలీ వేటు
చండీగఢ్: పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాన్వాయ్‌ను అడ్డుకుని రైతులు ఆకస్మికంగా ఆందోళనకు దిగడం, ఫ్లై ఓవర్ మీదనే ప్రధాని ఆగాల్సిరావడం వంటి భద్రతా వైఫల్య ఘటనలపై పంజాబ్ రాష్ట్ర సర్కార్.. పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రధానికి సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీచేశారు. బుధవారం రోజు ఘటన జరిగిన ఫిరోజ్‌పూర్ పోలీస్ పరిధి బాధ్యతలు చూసిన ఫిరోజ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ), ఐపీఎస్ అధికారి హర్మన్దీప్ సింగ్ హాన్స్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. హర్మన్దీప్ను లూథియానాలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ) మూడో కమాండెంట్‌గా బదిలీచేశారు. ఈయన స్థానంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్‌ను నియమించారు. నౌనిహాల్ సింగ్, ఏకే మిట్టల్, సుఖ్చయిన్ సింగ్, నానక్ సింగ్, అల్కా మీనాలను బదిలీచేశారు. పీపీఎస్ అధికారులు హర్కమల్ప్రీత్ సింగ్, కుల్జీత్ సింగ్‌లనూ మరో చోటుకు బదిలీచేశారు. తప్పంతా ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీదే.. జాతీయ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించేందుకు హుస్సైనీవాలాకు బయల్దేరిన ప్రధాని మోదీని మార్గమధ్యంలో రైతులు అడ్డుకున్న ఉదంతంపై కేంద్ర హోం శాఖకు పంజాబ్ సర్కార్ ఒక నివేదికను సమర్పించింది. జనవరి ఐదు నాటి ఘటనలో వివరణ ఇవ్వాలని బటిందా ఎస్ఎస్పీ అజయ్ మలూజాను కేంద్ర హోం శాఖ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు శుక్రవారం పంపిన విషయం తెల్సిందే. దానిపై మలూజా ఇచ్చిన వివరణ.. హోం శాఖకు పంపిన నివేదికలో ఉంది. ఆ నివేదికలోని వివరాలు కొన్ని బహిర్గతమయ్యాయి. ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ హర్మణ్ చేసిన తప్పు వల్లే మోదీకి భద్రత కల్పన విఫలమైందని మలూజా ఆరోపించారు. హుస్సైనీవాలాకు వెళ్లే మార్గంలో బటిందా పరిధిలోని తమ పరిధి వరకూ మోదీకి రక్షణ కల్పించామని, ఫిరోజ్‌పూర్ పరిధిలోకి కాన్వాయ్ వచ్చాకే ఈ ఘటన జరిగిందని మలూజా వివరణ ఇచ్చారు. ప్రధాని రాకకు ముందు జరిగిన ఘటనలు మొదలుకుని, రైతుల ఆందోళన, ప్రధాని బహిరంగ సభకు వెళ్లకుండా వెనుతిరగడం వరకు జరిగిన ఘటనలు, వాటి పర్యవసానాలను పంజాబ్ ప్రభుత్వం క్రమపద్ధతిలో నివేదించింది. రైతుల ఆందోళన అనేది ముందస్తు వ్యూహం కాదని, హఠాత్పరిణామం అని నివేదిక పేర్కొంది. -
మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!
న్యూఢిల్లీ/చండీగఢ్: భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బుధవారం ప్రధాని కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్‌పై నిలిచిపోయారు. దీనిపై మండిపడిన కేంద్ర హోంశాఖ ఘటనపై తక్షణ వివరణ ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన మోహరింపులు చేయలేదని అభిప్రాయపడింది. మోదీ కాన్వాయ్‌ను ఆపి పైరియాణా సమీపంలో ఆందోళనకు దిగిన రైతులు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సహించరానిదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిపై భౌతికదాడికి కాంగ్రెస్ యత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ ర్యాలీకి జనాలు తగినంతగా హాజరుకాలేదనే ప్రధాని వెనుదిరిగారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటన కారణంగా ముందుగా నిర్ణయించిన ఫిరోజ్‌పూర్ ర్యాలీని ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఏం జరిగింది? హోంశాఖ కథనం ప్రకారం హుసేనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం సందర్శన కోసం బుధ వారం ఉదయం ప్రధాని మోదీ పంజాబ్‌లోని భ టిండా చేరుకున్నారు. అక్కడినుంచి స్మారకచిహ్నం వద్దకు ఆయన హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే అనుకోకుండా వర్షం పడి వాతావరణం ప్రతికూలంగా మారింది. వాతావరణం అనుకూలంగా మారుతుందేమోనని ప్రధాని దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. కానీ వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రధాని రోడ్డుమార్గం ద్వారా ప్రయాణమయ్యే విషయాన్ని అధికారులు రాష్ట్ర డీజీపీకి తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. పోలీసుల నుంచి తగిన ధ్రువీకరణ అందిన తర్వాత ప్రధాని కాన్వాయ్ హుసేనీవాలాకు బయలుదేరింది. గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రధాని కాన్వాయ్ పైరియాణా గ్రామ సమీప ఫ్లైఓవర్‌ను చేరుకుంది. అక్కడ కొందరు రైతులు నిరసనకు దిగి రోడ్డును దిగ్భంధించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని తన కాన్వాయ్‌తో ఫ్లైఓవర్‌పై దాదాపు 15–20 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశ నాయకుడు నడిరోడ్డుపై నిలిచిపోవడాన్ని చూసి దేశం నిర్ఘాంతపోయింది. సుమారు 200 మంది రైతులు అకస్మాత్తుగా రోడ్డును నిర్భంధించారని పంజాబ్ డీఐజీ ఇందర్బీర్ సింగ్ చెప్పారు. క్రమం గా ఫ్లైఓవర్‌కు అవతల నిరసనకారులు భారీగా గుమిగూడుతుండడంతో రక్షణకు రిస్కు ఏర్పడుతుందని భావించి ప్రధాని కాన్వాయ్‌ను తిరిగి భటిండాకు మరలించాలని నిర్ణయించామన్నారు. ఆ ముగ్గురూ ఎందుకు లేరు! దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తే గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి. అదే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పర్యటనకు వస్తే ప్రభుత్వం తరఫున సీఎం లేదా ఒక మంత్రితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కలకలం రేపుతున్న ప్రధాని పంజాబ్ పర్యటనలో ఆయనకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతించేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం వల్ల తాను వెళ్లలేదని సీఎం చన్నీ చెప్పారు. ఐదు ప్రశ్నలు 1. ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్ చేయడంలో పంజాబ్ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? 2. నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు? ఎవరు ఉప్పందించారు? 3. ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు రోడ్డును దిగ్భందించారని తెలుసా? 4. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ– మోదీ భద్రత చూస్తుంది) పంజాబ్ పోలీసులకు తెలిపిందా? 5. జరగబోయేదేమిటో పంజాబ్ అధికార యంత్రాంగానికి ముందే తెలుసా? ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా.. మీ సీఎంకు థ్యాంక్స్! మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి. కనీసం నేను భటిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో వచ్చాను కదా!’’ అని ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో వ్యాఖ్యానించారు. హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యం కారణంగా వెనుదిరిగి భటిండాకు చేరుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన తనను కనీసం ప్రాణాలతో ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యల విషయం తనకు తెలియదని పంజాబ్ సీఎం చన్నీ చెప్పారు. ఒకవేళ ప్రధాని కోపంతోనో, రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య లు చేసి ఉంటే తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. సీఎం కనీసం అందుబాటులో లేరు! ఒకపక్క మార్గం క్లియర్‌గా ఉందని ప్రధాని భద్రతా దళాని (ఎస్పీజీ)కి పంజాబ్ డీజీపీ, సీఎస్ హామీ ఇచ్చారు, మరోపక్క అదే మార్గంలో నిరసనకారులకు అనుమతినిచ్చారు. పరిస్థితిని ఇంకా త్రీవం చేసేందుకు సీఎం చన్నీ కనీసం ఫోనులో అందుబాటులోకి రాలేదు, ఈ సమస్యను పరిష్కరించే యత్నాలు చేపట్టలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను నమ్మే ఎవరికైనా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు బాధను కలిగిస్తాయి. మోదీ ర్యాలీకి హాజరుకాకుండా ప్రజలను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిరసనకారులతో కలిసి భారీగా బస్సులను ఆపేశారు. ఇలాంటి చర్యలతో భగత్ సింగ్ తదితర దేశభక్తులకు ప్రధాని నివాళి అర్పించకుండా అడ్డుకున్నారు. వీరికి స్వాతంత్య్ర సమరయోధులపై ఎలాంటి గౌరవం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తోంది. పంజాబ్‌లో ప్రధాని ఆరంభించాల్సిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు వీరివల్ల ఆగిపోయాయి. కానీ మేము వీరిలాగా చౌకబారుతనంతో వ్యవహరించము. ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికే పాటుపడతాం.’’ – బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరాలు ఎవరు లీక్ చేశారు? ప్రధాని మార్గాన్ని అడ్డుకున్న వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారమందించారు? ప్రధాని పర్యటనకు తప్పుడు క్లియరెన్స్ ఎందుకిచ్చారు? రక్షణ వైఫల్యం జరిగిందన్న సమాచారం తర్వాత ఎందుకు ఎవరూ స్పందించలేదు? ప్రధాని మృత్యు అంచుకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందానిస్తోందా? దేశ ప్రధానిని ప్రమాదకరమైన మార్గంలో తీసుకువచ్చేలా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యత్నించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పంజాబ్ పుణ్యభూమిపై హత్యాకాండ జరపాలని యత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. – స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి జరిగిన దానికి చింతిస్తున్నాం! మార్గమధ్యంలో అడ్డంకుల వల్ల ప్రధాని వెనుతిరగడంపై విచారిస్తున్నాం. ఆయన దేశానికి ప్రధాని, మేమంతా గౌరవిస్తాం. భద్రతా లోపం ఉందని చెప్పడం సరికాదు. భటిండా నుంచి పీఎం రోడ్డు మార్గంలో వెళ్తారన్న ప్రణాళికేమీ లేదు. కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రాగా ప్రధాని కాన్వాయ్‌ని మరో మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లమని సూచించాం. కానీ ఆయన వెనుదిరిగారు. ఇది బాధాకరం. గతరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులను తొలగించాం. అయినాకానీ అనుకోకుండా కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రావడమనేది హానికరమేమీ కాదు. రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేశారు కానీ ఎవరికీ హాని చేయలేదు. అలాంటి వారిపై లాఠీలు ఝళిపించమని చెప్పలేను. ఫిరోజ్పూర్లో బీజేపీ ర్యాలీ కోసం 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే 700 మంది వచ్చారు. దీనికి నేనేమీ చేయలేను. హోంశాఖ కోరినట్లు మొత్తం çఘటనపై విచారణ చేస్తాం. రోడ్డు మార్గంలో వెళ్లాలనేది పోలీసు, ఎస్పీజీ ఇతర ఏజెన్సీల ఉమ్మడి నిర్ణయం. ఈ నిర్ణయాల్లో పోలీసుల పాత్ర చాలా పరిమితం. ఎస్పీజీ, ఐబీ తదితర కేంద్ర ఏజెన్సీలు వీటిని నిర్వహిస్తాయి. ఈ మొత్తం ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అతిధిపై దాడి చేయడం కన్నా చావడానికే ఒక పంజాబీ ప్రాధాన్యమిస్తాడు. – చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం -
ఆస్ట్రేలియాలో ఉంటూ.. పక్కా ప్లాన్ ప్రకారం..
చండీగఢ్ : అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డుగా ఉందన్న అక్కసుతో ప్రియురాలి చేత కట్టుకున్న భార్యను హత్య చేయించాడో కిరాతకుడు. ఆస్ట్రేలియాలో ఉంటూనే పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయించి గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెను అంతమొందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫిరోజ్‌పూర్ ఎస్పీ సందీప్ గోయల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘ మృతురాలు రవ్నీత్ కౌర్ అనే గర్భిణి.. భర్త జస్ప్రీత్తో కలిసి ఆస్ట్రేలియాలో నివసించేవారు. కొన్ని రోజుల క్రితం ఆమె పంజాబ్‌లోని పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో మార్చి 14న భర్తతో వీడియో కాల్ మాట్లాడేందుకు బయటికి వెళ్లి అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆమె సోదరుడు ఫిర్యాదు చేశారు. అనంతరం భక్రా కెనాల్లో శవమై తేలారు. ఈ విషయం గురించి విచారణ జరుపగా.. రవ్నీత్ భర్త జస్ప్రీత్కు కిరణ్‌జీత్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలో తన భార్యను చంపాల్సిందిగా కోరడంతో కిరణ్‌జీత్ తన సోదరితో కలిసి రవ్‌నీత్‌ను హత్య చేయించినట్లు ఆధారాలు లభించాయి. నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. జస్ప్రీత్, కిరణ్జీత్లను ఇక్కడకు రప్పించాల్సి ఉంది’ అని సందీప్ గోయల్ పేర్కొన్నారు. -
‘పవిత్ర గ్రంథాలను ఇలా వాడతారా?
పంజాబ్, ఫిరోజ్‌పూర్ : పవిత్ర గ్రంథాన్ని అనుచిత పనుల కోసం వాడి.. దాన్ని అపవిత్రం చేశారనే నేపంతో గురుద్వారా పూజారిని, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల ప్రకారం.. ఫిరోజ్‌పూర్ గురుద్వారాలో పూజారిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి భార్య పవిత్ర గ్రంథంలోని పేజీలను చింపి.. వాటిలో చపాతీలను చుట్టి పిల్లలకు ఇచ్చి పాఠశాలకు పంపింది. ఇది గమనించిన మిగతా విద్యార్ధులు ఈ విషయాన్ని తొలుత సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్‌కి తెలియజేశారు. దాంతో వారు సదరు పూజారి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా వారి వంట గదిలో మరికొన్ని పదార్ధాలను కూడా పవిత్ర గ్రంథంలోని పేపర్లలో చుట్టి పెట్టారు. ఈ విషయం గురించి యూనియన్ అధ్యక్షుడు ‘మేము పవిత్ర గ్రంథాన్నే మా దైవంగా పూజిస్తాం. అలాంటిది ఆ గ్రంథాన్ని చింపడమే కాక ఆ పేజీలను ఇలాంటి పనుల కోసం వినియోగించడం దారుణ. నిజంగా ఇది చాలా అపవిత్రమైన పని. భవిష్యత్తులో మరోకరు ఇలాంటి పనికి పాల్పడకూడదనే ఉద్దేశంతో సదరు పూజారి, అతని భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశామ’ని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు పూజారిని, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మహిళను జుట్టుపట్టి కొట్టిన డాక్టర్
-
వైరల్ : మహిళను జుట్టుపట్టి కొట్టిన డాక్టర్
ఫిరోజ్‌పూర్ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పది మంది ప్రాణాలు కాపాడుతూ.. ఎంతో దయా హృదయంలో మెలగాల్సిన ఓ డాక్టర్, మహిళను జుట్టు పట్టి కొట్టాడు. ఈ మొత్తం సంఘటన కెమెరాకి చిక్కింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. మహిళ జుట్టు పట్టి కొడుతూ కుషాల్దీప్ సింగ్ అనే డాక్టర్, ఆమెను వార్డు నుంచి ఆసుపత్రి ప్రవేశం వరకు తీసుకొచ్చాడు. పక్కనే పోలీసులు ఉన్న వారేమి చేయకుండా.. అలానే నిల్చుని ఉండిపోయారు. మధ్యమధ్యలో వారించిన పెద్దగా ఆ డాక్టర్‌ను ఏం చేయలేకపోయారు. ఇద్దరు పోలీసు అధికారుల ముందే ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని సోషల్ మీడియా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన అథారిటీలు ఈఎన్టీ నిపుణుడైన కుషాల్దీప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. డాక్టర్‌కు వ్యతిరేకంగా కేసును రిజిస్ట్రర్ చేశారు. -
రూ.75 కోట్ల హెరాయిన్ పట్టివేత
ఫెరోజ్‌పూర్: ఫెరోజ్పూర్లో సరిహద్దు భద్రతా దళం అధికారులు(బీఎస్ఎఫ్) 15 కేజీల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బందికి, పాకిస్తానీ స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగినట్లు ఓ బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. దీంతో స్మగ్లర్లు హెరాయిన్‌ని వదిలి పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 75 కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు. -
రోజుకూలీ ఖాతాలో కోటి రూపాయలు!
లుథియానా: ఆదాయపన్ను శాఖ అధికారులు పంపిన నోటీసు చూసి అతడుగాడు నోరెళ్లబెట్టగాడు. ఐటీ నోటీసు అందుకున్న అతడు సాఫ్ట్ వేర్ ఉద్యోగో, ప్రభుత్వ ఉద్యోగో కాదు. రోజువారి కూలీ. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ కు చెందిన అతడికి రూ.40 లక్షల పన్ను కట్టాలని ఐటీ అధికారులు నోటీసు పంపడంతో అవాక్కయ్యాడు. అతడి బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలున్నాయని, దానికి పన్ను కట్టాలని తాఖీదు పంపడంతో కంగుతిన్నాడు. నెలకు రూ. 8 వేల సంపాదనతో నెట్టుకొస్తున్న తనకు బ్యాంకు ఖాతాయే లేదని, తానెప్పుడు బ్యాంకులో డబ్బు జమ చేయలేదని అధికారులకు అతడు తెలిపాడు. ఎన్ను ఎగవేసేందుకు కొంతమంది అక్రమార్కులు షాడో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పేదల గుర్తింపు, నివాస పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. ఇలాంటి షాడో బ్యాంకు ఖాతాలు పంజాబ్ లో అధికమయ్యాయి. తీవ్రవాదులకు నిధులు, హవాలా సొమ్ము ఈ ఖాతాల ద్వారా పంపిణీ అయ్యే అవకాశముందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హవాలా ఆపరేటర్లు, పన్ను ఎగవేతదారులు, బ్యాంకు అధికారులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. బ్యాంకు అధికారులపై వచ్చిన ఫిర్యాదులను ఆర్ బీఐకి పంపిస్తోంది. -
పంజాబ్‌లో మళ్లీ కలకలం!
చండీగఢ్: పంజాబ్ లోని ఫిరోజ్‌పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల సంచారం మంగళవారం కలకలం సృష్టించింది. పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేసిన్లో ఇటీవలే పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ విషయం అందరికీ విదితమే. మళ్లీ కొన్ని రోజుల్లోనే ఆర్మీ దుస్తువుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్దాస్పుర్ లోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిరోజ్‌పుర్ పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న జిల్లా. గుర్దాస్పుర్ నుంచి ఫిరోజ్‌పుర్ కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఉగ్రవాద చర్యలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని చుట్టుముట్టారు. ఫిరోజ్పుర్లో హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బలగాలను, అదనపు పోలీసు సిబ్బందిని అక్కడికి తరలించినట్లు సమాచారం. ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం ఆ భవనం సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరోజ్పుర్తో పాటు గుర్దాస్పుర్ జిల్లాలోనూ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. చెరకు పంట పొలాల్లో, సమీప గ్రామాల్లో పోలీసులు, ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుర్దాస్పుర్ స్థానికుడు ఇద్దరు ఆర్మీ దుస్తువులు ధరించిన ఇద్దరిని చూసినట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్మీ దుస్తువుల్లో వచ్చి పఠాన్‌కోట్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందడంతో పాటు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
పంజాబ్‌లో మళ్లీ కలకలం!
-
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
మోగా: ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన సంఘటనల్నే చూశాం. కాని ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని మోగా-ఫిరోజ్ పూర్ రోడ్డులో చోటు చేసుకుంది. ఏటీఎంకు కాపాలదారుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డు కళ్లల్లో రసాయన పదార్ధాలు చల్లి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు పరిస్థితి విషమంగా ఉందని, కళ్లు కనిపించడం లేదని పోలీసులు వెల్లడించారు. ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 1,70,600 రూపాయలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. మోటార్ వాహనంలో ఏటీఎంను తరలించారని, హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.