ఆస్ట్రేలియాలో ఉంటూ.. పక్కా ప్లాన్‌ ప్రకారం.. | Pregnant Woman Found Dead In Punjab Canal | Sakshi
Sakshi News home page

ప్రియురాలి చేత భార్యను చంపించేశాడు

Published Wed, Mar 27 2019 1:32 PM | Last Updated on Wed, Mar 27 2019 1:50 PM

Pregnant Woman Found Dead In Punjab Canal - Sakshi

అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డుగా ఉందన్న అక్కసుతో ప్రియురాలి చేత కట్టుకున్న భార్యను హత్య చేయించాడో కిరాతకుడు.

చండీగఢ్‌ : అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డుగా ఉందన్న అక్కసుతో ప్రియురాలి చేత కట్టుకున్న భార్యను హత్య చేయించాడో కిరాతకుడు. ఆస్ట్రేలియాలో ఉంటూనే పక్కా ప్లాన్‌ ప్రకారం కిడ్నాప్‌ చేయించి గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెను అంతమొందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫిరోజ్‌పూర్‌ ఎస్పీ సందీప్‌ గోయల్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

‘ మృతురాలు రవ్‌నీత్‌ కౌర్‌ అనే గర్భిణి.. భర్త జస్ప్రీత్‌తో కలిసి ఆస్ట్రేలియాలో నివసించేవారు. కొన్ని రోజుల క్రితం ఆమె పంజాబ్‌లోని పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో మార్చి 14న భర్తతో వీడియో కాల్‌ మాట్లాడేందుకు బయటికి వెళ్లి అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆమె సోదరుడు ఫిర్యాదు చేశారు. అనంతరం భక్రా కెనాల్‌లో శవమై తేలారు. ఈ విషయం గురించి విచారణ జరుపగా.. రవ్‌నీత్‌ భర్త జస్ప్రీత్‌కు కిరణ్‌జీత్‌ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలో తన భార్యను చంపాల్సిందిగా కోరడంతో కిరణ్‌జీత్‌ తన సోదరితో కలిసి రవ్‌నీత్‌ను హత్య చేయించినట్లు ఆధారాలు లభించాయి. నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. జస్ప్రీత్‌, కిరణ్‌జీత్‌లను ఇక్కడకు రప్పించాల్సి ఉంది’ అని సందీప్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement