అమేథి: వైద్యో నారాయణా హరీ.. !! వైద్యుడు దేవుడితో సమానమంటారు. కనిపించని దేవుడు కంటే ప్రాణాలు నిలబెట్టే వైద్యుడినే దేవుడిగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన వృత్తిని చేపట్టిన ఓ వైద్యుడు దారితప్పి ప్రవర్తించాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో అమేథి జిల్లా, కామరౌలీ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని అమేథి జిల్లా కామరౌలీ ప్రాంతంలో యుసీ పాండే అనే వైద్యుడు క్లినిక్ నడుపుతున్నాడు. చికిత్స నిమిత్తం క్లినిక్కు వచ్చే ఆడవాళ్లపై అయ్యగారి కన్నుపడింది. చికిత్స నిమిత్తం క్లినిక్లో చేరిన16ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాలిక ఆమె తల్లికి చెప్పింది. దాంతో బాధితురాలి తల్లి వైద్యుడిపై కామరౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు పోలీసులు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.
బాలిక పట్ల వైద్యుడి అనుచిత ప్రవర్తన, కేసు నమోదు
Published Sat, Nov 22 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement