
లక్నో : సాధారణంగా జైళ్లకి తప్పు చేసిన వ్యక్తులు వెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని జలన్ జిల్లా ఉరై జైలులో ఓ విడూరం జరిగింది. గాడిదలు తప్పు చేశాయంటూ, ఆ జంతువులను జైలులో పెట్టారు అధికారులు. ఇంతకీ ఆ ఎనిమిది గాడిదలు చేసిన పెద్ద తప్పేమిటో తెలుసా? జైలు కాంపౌండ్‌లో ఉన్న ఖరీదైన మొక్కల్ని నాశనం చేయడమే. వీటి విలువ లక్షల్లో ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. తమ సీనియర్ అధికారి జైలుకి లోపల ఏర్పాటుచేసిన ఖరీదైన మొక్కలను ఈ గాడిదలు నాశనం చేశాయంటూ హెడ్ కానిస్టేబుల్ ఆర్‌కే మిశ్రా చెప్పారు.
గాడిదలను వదులుకోవాల్సి వస్తుందంటూ పలు మార్లు ఓనర్‌ను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, దీంతో వీటిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ గాడిదలను జైలు నుంచి బయటికి విడిపించడానికి ఓ స్థానిక రాజకీయ నాయకుడు బెయిల్ మొత్తాన్ని చెల్లించాడు. బెయిల్‌కు కావాల్సిన నగదు కట్టడంతో జైలు అధికారులు ఆ గాడిదలకు విముక్తి కల్పించారు. తమ గాడిదలు జైలు నుంచి విడుదలవుతున్నాయని ఇక్కడికి వచ్చానని, నాలుగు రోజుల పాటు తమ ఎనిమిది గాడిదలు జైలులోనే ఉన్నట్టు వాటి యజమాని కామ్‌లేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment