'తాగడం మా సంస్కృతి.. నిషేధించం!'
మద్యపానం అనేది గోవా సంస్కృతిలో ఒక భాగమని, అందువల్ల గోవాలో మాత్రం మద్య నిషేధం అన్న ఆలోచనే చేయబోమని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విల్ఫ్రెడ్ మెస్కిటా అన్నారు. మద్యనిషేధం గోవాకు అసలు రాలేదని, ఎందుకంటే గోవా సంస్కృతిలోనే మద్యపానం ఇమిడి ఉందని ఆయన అన్నారు.
కేరళలో దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి ఆలోచన ఏదైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయనీ విషయం తెలిపారు. గోవాలో పెళ్లిళ్ల సమయాల్లోను, ఇతర సామాజిక సందర్భాలలోను మద్యం ఇచ్చి పుచ్చుకోవడం సర్వ సాధారణమని మెస్కిటా చెప్పారు.