త్వరలో బహిరంగ మద్యపాన నిషేధం: సీఎం
త్వరలో బహిరంగ మద్యపాన నిషేధం అమలు: సీఎం
Published Mon, Sep 18 2017 10:19 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
సాక్షి, పనాజీ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం.. ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా వ్యవహరించటం లాంటి కేసులు పెరిగిపోతున్న క్రమంలో గోవా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం అమలు తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ దీనిపై స్వయంగా ఓ ప్రకటన చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధ నిర్ణయం త్వరలోనే అమలు చేయబోతున్నాం, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉండబోతున్నాయి అని పారికర్ ప్రకటించారు. అంతేకాదు బహిరంగ ప్రాంతాల్లో మద్యపానాన్ని ప్రోత్సహించే లిక్కర్ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గోవా, డామన్ డయ్యు ఎక్సైజ్ యాక్ట్ 1964కు త్వరలో అవరసరమైన సవరణలు చేయనున్నట్లు పారికర్ తెలిపారు.బీచ్‌లలో మద్యం సేవించటంపై ఇప్పటికే అక్కడ నిషేధం అమలులో ఉంది.
Advertisement
Advertisement