
మా కుమార్తె వివాహానికి రండి
ప్రధానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ దంపతుల ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ దంపతులు ఆహ్వానించారు. సోమవారం పార్లమెంటు కార్యాలయంలో దత్తాత్రేయ తన సతీమణి విజయలక్ష్మితో ప్రధానిని కలసి ఆహ్వానపత్రిక అందజేశారు.