కర్నాటక మంత్రి డీకే శివకుమార్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మంత్రి శివకుమార్‌తో పాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్య తదితరులపై పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. రూ కోట్ల విలువైన హవాలా లావాదేవీలు నిర్వహించారని, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని బెంగళూర్‌లో ప్రత్యేక న్యాయస్ధానంలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ మంత్రిపై కేసు నమోదు చేసింది.
కాగా స్టేట్‌మెంట్లను నమోదు చేసేందుకు త్వరలోనే వీరికి ఈడీ సమన్లు జారీ చేయనుంది. శివకుమార్, ఆయన సహచరుడు ఎస్‌కే శర్మ తరచూ పెద్దమొత్తంలో లెక్కతేలని మొత్తాన్ని హవాలా మార్గాల్లో మరో ముగ్గురు నిందితులతో కలిసి చేరవేసేవారని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు.
లెక్కచూపని మొత్తాన్ని ఢిల్లీ, బెంగళూర్‌ల్లో తన నెట్‌వర్క్ ద్వారా శివకుమార్ అక్రమ మార్గాల్లో చేతులు మార్చేవారని తమకు ఆధారాలు లభించాయని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment