Kannada Producer Files Complaint Against Hero Darshan Over Death Threat - Sakshi
Sakshi News home page

Hero Darshan: చిక్కుల్లో స్టార్‌ హీరో దర్శన్‌, ఆడియో క్లిప్‌తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత

Published Thu, Aug 11 2022 1:06 PM | Last Updated on Thu, Aug 11 2022 3:00 PM

Kannada Producer Files Complaint Against Hero Darshan Over Death Threat - Sakshi

కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌పై పోలీసు కేసు నమోదైంది. దర్శన్‌  బెదిరిస్తున్నాడని, అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్శన్‌పై కెంగేరి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంద. వివరాల్లోకి వెళితే.. భరత్‌ విష్ణుకాంత్‌ అనే నిర్మాత భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నటుడు ధృవన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. అయితే కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేకపోవడంతో నిర్మాత సినిమాను పూర్తి చేయలేకపోయాడు.

చదవండి: లలిత్‌ మోదీతో డేటింగ్‌.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్‌

ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్‌ ధృవన్‌కు వివరించాడు. ఒకవేళ డబ్బు సర్ధుబాటు అయితే గనుక తాను సినిమాను తిరిగి ప్రారంభిస్తానని మాట కూడా ఇచ్చాడట. కానీ ఆ విషయాన్ని పట్టించుకొని ధృవన్‌ స్టార్‌ హీరో అయిన దర్శన్‌కు చెప్పుకుని వాపోయాడు. అనంతరం దర్శన్‌.. నిర్మాత భరత్‌కు ఫోన్‌ చేసి సినిమాను ఎలాగైన పూర్తి చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన భరత్‌ పోలీసులను ఆశ్రయించి హీరో దర్శన్‌, నటుడు ధృవన్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వారిపై పటిషన్‌ దాఖలు చేసి దానితో పాటు దర్శన్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ను కూడా పోలీసులకు అందజేశాడు.

చదవండి: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు

కాగా ఆడియోలో దర్శన్‌, నిర్మాతతో.. ‘వెంటనే సినిమాను పూర్తి చేయాలని, లేదంటే ఏదైనా జరగొచ్చు. నేను తలుచుకుంటే కనబడకుండా పోతావ్‌. నేను ఏదైనా చెప్పే చేస్తాను. నిన్ను ఎక్కడా కనిపించకుండా చేయగలను’ అంటూ నిర్మాతను భయపెట్టడం.. దీంతో నిర్మాత లాక్‌డౌన్‌ తర్వాత సినిమాను ప్రారంభిస్తానని చెప్పుకురాడం ఆడియోలో క్లియర్‌ ఉంది. ఇక ఈ ఆడియో ఆధారంగా పోలీసులు దర్శన్‌, నటుడు ధృవన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో అయిన దర్శన్‌కు కన్నడలో విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌. ఇక ఆయనను ఫ్యాన్స్‌ డిబి బాస్‌ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement