
ముంబై / న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ను రూ.12,000 కోట్ల మేర మోసంచేసిన కేసులో నీరవ్‌మోదీకి అత్యంత సన్నిహితుడైన శ్యామ్‌సుందర్ వాధ్వాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకుంది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద మంగళవారం రాత్రి వాధ్వాను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ గ్రూప్‌కు వాధ్వా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడన్నారు. విదేశాలకు పారిపోయిన నీరవ్‌తో వాధ్వా టచ్‌లో ఉన్నాడనీ, ఈ కుంభకోణంలో నీరవ్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను అతనే చక్కబెట్టాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment