
ఇస్లామాబాద్(పాకిస్తాన్): భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో శనివారం రాత్రి ఎనిమిది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నగరంలోని ఓ బిల్డింగ్‌లో దాక్కున్నారని తెలియడంతో పోలీసులు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ జరిగిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందారు. మరో ముగ్గురు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. సంఘటనా స్థలంలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.