rangers
-
ఎనిమిది మంది ఉగ్రవాదుల కాల్చివేత
ఇస్లామాబాద్(పాకిస్తాన్): భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో శనివారం రాత్రి ఎనిమిది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నగరంలోని ఓ బిల్డింగ్‌లో దాక్కున్నారని తెలియడంతో పోలీసులు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందారు. మరో ముగ్గురు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. సంఘటనా స్థలంలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
పలన్వాలా గ్రామంపై పాక్ రేంజర్ల కాల్పులు
-
సరిహద్దులో బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల సమావేశం
జమ్మూ: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా సిబ్బంది సమావేశం నిర్వహించారు. సాంబా జిల్లాలో ఆర్ ఎస్ పుర సెక్టార్ వద్ద ఆదివారం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారి సోమవారం వెల్లడించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గురించి సమావేశంలో చర్చించినట్లు తెలిపిన ఆయన ఇరుదేశాల సైనికులు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాకిస్థాన్‌కు చెందిన నలుగురు సైనికాధికారుల బృందం పాల్గొంది. నవంబర్ 3న జరిగిన ఫ్లాగ్ మీటింగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. -
'దొంగచాటుగా కాల్పులెందుకు?'
న్యూఢిల్లీ: దొంగచాటుగా కాల్పులు ఎందుకు జరుపుతున్నారని భారత అధికారులు పాకిస్థాన్ అధికారులను బుధవారం ప్రశ్నించనున్నారు. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన అత్యున్నత స్థాయి సమావేశం మధ్యలోనే రద్దయిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాలమధ్య ప్రతి రోజు ఓ రకమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా బుధవారం ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతుంది. ఇందులో మొత్తం 16మంది సభ్యులు పాల్గొంటున్నారు. వీరంతా కూడా సరిహద్దులో కాపలాకాసే బీఎస్ఎఫ్ బలగాల ఉన్నతాధికారుల స్థాయికి చెందిన వారు. ఈ నేపథ్యంలో భారత్ మూడు కీలక అంశాలను పాక్ ఉన్నతాధికారులను ప్రశ్నించనుంది. అందులో ఒకటి అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఎందుకు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నారు? దొంగచాటుగా బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులు ఎందుకు చేస్తున్నారు? రాణ్ ఆఫ్ కచ్ భూభాగంలోకి ఎందుకు చొరబడుతున్నారనే అంశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి సమావేశం లాహోర్‌లో 2013 డిసెంబర్లో జరిగింది.