జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌ | elephants hulchul in national highway at bhubaneswar | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

Published Mon, May 15 2017 10:58 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

elephants hulchul in national highway at bhubaneswar

భువనేశ్వర్‌: జాతీయ రహదారిపై ఏనుగుల గుంపు హడలెత్తించింది. కటక్ అనుగుల్‌ 55వ నంబరు జాతీయ రహదారిపై కటక్‌ జిల్లా బల్లి బొవులొ ఛక్‌ వద్దకు సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు తరలివచ్చింది. గంటల తరబడి జాతీయ రహదారిపై తిరుగాడటంతో వాహనాల రవాణా స్తంభించిపోయింది.
 
అటవీ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల గుంపును తరిమి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. గుంపులో 8 ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు. అడవిలో వేడి తాళలేక జాతీయ రహదారి ఇరు వైపులా ఉన్న మామిడి చెట్ల ఛాయలో సేద తీరేందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement