elephants hulchul
-
తిరుమలలో ఏనుగుల బీభత్సం
-
ఆర్మీ ఆస్పత్రిలో ఏనుగుల కలకలం
-
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
సదుం/పిచ్చాటూరు/సోమల/తిరుమల: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తహసీల్దారు గుర్రప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, పెద్దడివి నుంచి జోగివారిపల్లె అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాలపై సుమారు 15 ఏనుగులు దాడి చేశాయి. పదిహేను మంది రైతులకు చెందిన మామిడి తోటల్లో చెట్ల కొమ్మలను విరిచేయడంతో పాటు, నలుగురు రైతుల చెరుకు గానుగలను ధ్వంసం చేశాయి. గ్రామ సమీపంలోని చెరుకు తోటలో నిద్రిస్తున్న గొల్లపల్లెకు చెందిన ఎల్లప్ప(38)పై ఏనుగులు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూరు పట్టణంలోకి బుధవారం అర్ధరాత్రి మూడు ఏనుగులు ప్రవేశించాయి. స్థానికులు, ఫారెస్టు అధికారులు పట్టణ పొలిమేరల్లోకి తరిమికొట్టారు. గురువారం వేకువజామున మండలంలోని వేలూరు, వెంగళత్తూరు, రామాపురం గ్రామాల్లోని వరి, సంపంగితోటలను ధ్వంసం చేశాయి. పంట పొలాలను ఆనుకుని నివాస ప్రాంతాలు ఉండడంతో ప్రజలు, రైతులు భయాందోళనకు లోనయ్యారు. సోమల మండలం, అన్నెమ్మగారిపల్లెకు చెందిన శేఖర్, ఆవులపల్లెకు చెందిన ఏసయ్య పెద్దపంజాని మండలంలోని మాధవరం నుంచి గురువారం వేకువ జామున పెద్ద ఉప్పరపల్లెకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని సోమల–పెద్ద పంజాని మండలాల సరిహద్దులోని దాబా సమీపంలో రోడ్డుపై ఏనుగులు కనిపించాయి. ద్విచక్ర వాహనాన్ని అక్కడే ఆపే ప్రయత్నం చేయగా.. గమనించిన ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి. వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ద్విచక్రవాహనాన్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై పాపవినాశనం మార్గంలో వెళ్తుండగా ఆకాశగంగ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా రెండు ఏనుగులు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రవాహనంపై ఉన్న వారి వెనుకపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యువకులు ద్విచక్రవాహనంపై వేగంగా వెనక్కు మళ్లారు. -
కల్లికోట్ల గ్రామంలో ఏనుగులు బీభత్సం
-
ఏనుగుల బీభత్సం
-
మళ్లీ ‘గజ’గజ
సాక్షి, ఎల్.ఎన్.పేట: ఏనుగుల బీభత్సం మళ్లీ మొదలైంది. రాత్రి వేళ పంటలను నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని సూదిరాయిగూడ, కరకవలస కొండల్లో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారేంత వరకు సూదిరాయిగూడ గిరిజన గ్రామం సమీపంలో హల్చల్ చేశాయి. రాత్రి 10 గంటల సమయానికి ఏనుగుల గుంపు సూదిరాయిగూడ గ్రామం సమీపానికి వచ్చాయని గిరిజనులు సరవ వెంపయ్య, సవర సుంబురు, సవర చింగయ్య, సవర సురేష్లతోపాటు పలువురు చెప్పారు. వారం రోజులుగా ఏనుగులు గ్రామ సమీపానికి వచ్చి వెళ్లి పోతున్నాయని, గురువారం రాత్రి ఏనుగులు వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏనుగులు గ్రామ వీధులోకి వచ్చాయని అప్పుడు మంటలు వేసి ఏనుగులను తరమాల్సి వచ్చిందని గిరిజనులు చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత శాఖ సిబ్బందికి ఫోన్ చేసినా వారు స్పందించ లేదని ఆరోపించారు. గ్రామంలో వీధి లైట్లు నాలుగే ఉన్నాయని, వీధి లైట్లు మరో రెండు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారం రోజులుగా ఏనుగులు రావడం, వెళ్లడం వలన సవర వెం పయ్య, సవర సుంబురులకు చెందిన మూడు ఎకరాల వరిచేనును పూర్తిగా కుమ్మేశాయని బాధిత గిరిజనులు వాపోయారు. పోడు పంటగా పండించే కంది, పసుపు పంటలతోపాటు అరటి, కొబ్బరి, జీడి, మామిడి తోటలను నాశనం చేస్తున్నాయని బాధిత గిరిజనులు వాపోతున్నారు. ఏనుగుల దాడి కారణంగా సవర సుంబురు, సవర ప్రసాదరావు, సవర సింగయ్య, సవర సన్నాయి, సవర వెంపయ్య, సవర సుజాత, సవర జ్యూయల్, సవర ఏసైలకు చెందిన అరటి పసుపు, కంది పంటలను కుమ్మేసి విరిచేస్తున్నాయని బాధిత రైతులు వాపోయారు. పోడు పంటలకు తీరని నష్టం జరిగిందన్నారు. కష్టపడి పండించిన పంటను ఏనుగులు తొండంతో పీకేయడం, కాలితో తొక్కేయడం వలన ఎందుకూ పనికిరాకుండా పోతుందని రోదిస్తున్నారు. ఏనుగుల కారణంగా ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల గుంపు దారి మళ్లించే ప్రయత్నాలు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్చల్
-
జాతీయ రహదారిపై ఏనుగుల హల్చల్
భువనేశ్వర్: జాతీయ రహదారిపై ఏనుగుల గుంపు హడలెత్తించింది. కటక్ అనుగుల్ 55వ నంబరు జాతీయ రహదారిపై కటక్ జిల్లా బల్లి బొవులొ ఛక్ వద్దకు సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు తరలివచ్చింది. గంటల తరబడి జాతీయ రహదారిపై తిరుగాడటంతో వాహనాల రవాణా స్తంభించిపోయింది. అటవీ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల గుంపును తరిమి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. గుంపులో 8 ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు. అడవిలో వేడి తాళలేక జాతీయ రహదారి ఇరు వైపులా ఉన్న మామిడి చెట్ల ఛాయలో సేద తీరేందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు వివరించారు. -
శ్రీకాకుళంలో ఏనుగుల బీభత్సం