వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్‌మ్యాప్‌ | Energy security leads series of UAE-India deals and agreements | Sakshi
Sakshi News home page

వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్‌మ్యాప్‌

Published Thu, Jan 26 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్‌మ్యాప్‌

వ్యూహాత్మక భాగస్వామ్యానికి రోడ్‌మ్యాప్‌

యూఏఈ, భారత్‌ చర్చలు,14 ఒప్పందాలు

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్, యూఏఈ మధ్య 14 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, భద్రత, వాణిజ్య, ఇంధనం తదితర కీలకాంశాలతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక కీలక మలుపని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కాగా, భారత్‌లో యూఏఈ 75 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.5లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టే అంశం ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబి యువరాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌–నహ్యన్‌ మధ్య జరిగిన 14 ఒప్పందాల్లో లేదు. బుధవారం డెలిగేట్స్‌ సమావేశం హైదరాబాద్‌ హౌస్‌ లో జరగగా, అనంతరం ప్రధాని అధికార నివాసంలో మోదీ, నహ్యన్‌లు గంటపాటు సమావేశమయ్యారు.

తర్వాత  ఇరువురూ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ చెప్పారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబం ధించి ఉపయుక్తమైన రోడ్‌మ్యాప్‌ రూపొం దించినట్లు చెప్పారు. రక్షణ, భద్రతా సహకారా నికి సంబంధించిన ఒప్పందాల ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు పేర్కొ న్నారు. దగ్గరి సంబంధాలు ముఖ్యమని, అది కేవలం ఇరు దేశాల మధ్యే కాదని, పొరుగు దేశాలన్నిం టితోనూ బలమైన సంబంధాలు ఉండాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు.

భారత్, యూఏఈ కలయిక ప్రాంతీయ సుస్థిరతకు సహకరి స్తుందన్నారు. అలాగే ఆర్థిక భాగస్వామ్యం ప్రాంతీయ, ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పాటునందిస్తుందన్నారు. అఫ్గాని స్తాన్‌తో పాటు మన ప్రాంత పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. మీ సందర్శన వల్ల మునుపటి సంబంధాలు మరింత బలపడతాయనే నమ్మకముందని అబుదాబి యువరాజును ఉద్దేశించి మోదీ అన్నారు.

నమ్మకమైన మిత్రదేశం: మోదీ
ప్రపంచంలో భారత్‌కు అత్యంత నమ్మకమైన మిత్రదేశాల్లో యూఏఈ ఒకటి అని మోదీ అభివర్ణించారు. భారత దేశ వృద్ధిలో ముఖ్యమైన భాగస్వామిగా యూఏఈని గౌరవిస్తామని చెప్పారు. మొత్తంగా రక్షణ ఉత్పత్తి, సాంకేతిక సహకారం, సముద్ర, రోడ్డు రవాణాలో ఉత్తమ విధానాల మార్పిడి.. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా నివారణకు కలసి పనిచేయడం, వాణిజ్య, చమురు నిల్వలు, నిర్వహణ తదితర 14 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement