న్యూఢిల్లీ: బహుళపక్ష చర్చలతోనే కశ్మీర్‌లో శాంతి స్థాపన సాధ్యమవుతుందని, అవసరమైతే ఆ చర్చల్లో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్ పేర్కొన్నారు. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఆయన భారత్‌కు చేరుకున్నారు.
అనంతరం ఓ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. అణు సరఫరాదారుల గ్రూపులో(ఎన్‌ఎస్‌జీ) భారత్ సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అఖిలపక్ష చర్చల వల్లే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాపడ్డారు భారత్, పాక్‌ల భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరుదేశాలు తమకు మంచి మిత్రులన్న ఎర్డోగన్, శాంతి స్థాపనతో పాటు చర్చల్ని ప్రారంభించడంతో టర్కీ తనవంతు పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు.