ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై ఈయూ నిషేధం ఎత్తివేత | EU lifts drug export ban from Ranbaxy’s Toansa plant | Sakshi
Sakshi News home page

ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై ఈయూ నిషేధం ఎత్తివేత

Published Fri, Jun 6 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై ఈయూ నిషేధం ఎత్తివేత

ర్యాన్‌బాక్సీ ప్లాంట్‌పై ఈయూ నిషేధం ఎత్తివేత

న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ  ప్లాంట్‌పై  విధించిన సస్పెన్షన్‌ను యూరోపియన్ ఆరోగ్య నియం త్రణ సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) గురువారం తొలగించింది. పంజాబ్‌లోని తోన్స గ్రామంలో వున్న ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాల్లో కొన్ని తయారీ లోపాలున్నప్పటికీ, ఈ ఔషధాలను వినియోగించుకోవచ్చని ఈఎంఏ వివరణ ఇచ్చింది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరిలో సస్పెండ్ చేసిన జీఎంపీ సర్టిఫికెట్‌ను  పునరుద్ధరిస్తున్నామని పేర్కొంది.
 
రోగులు నిరభ్యంతరంగా ఈ ఔషధాలను ఉపయోగించుకోవచ్చని భరోసానిచ్చింది. తోన్స ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలపై ఈ ఏడాది జనవరిలో అమెరికా ఆహార, ఆహార నియంత్రణ సంస్థ, యూఎస్‌ఎఫ్‌డీఏ నిషేధం విధించింది. దీంతో ఈ ప్లాంట్ నుంచి యూరప్‌కు జరిగే ఎగుమతులను  కంపెనీయే స్వచ్ఛందంగా సస్పెండ్ చేసింది. అయితే కంపెనీకి మధ్యప్రదేశ్‌లో ఉన్న దేవాస్ ప్లాంట్‌పై విధించిన నిషేధాన్ని ఈయూ కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement