137 ఏళ్ల తర్వాత కనిపించిన ‘ట్రీ ఫ్రాగ్’ | 'Extinct' tree frog rediscovered in India after 137 years | Sakshi
Sakshi News home page

137 ఏళ్ల తర్వాత కనిపించిన ‘ట్రీ ఫ్రాగ్’

Published Fri, Jan 22 2016 1:21 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

137 ఏళ్ల తర్వాత కనిపించిన ‘ట్రీ ఫ్రాగ్’

137 ఏళ్ల తర్వాత కనిపించిన ‘ట్రీ ఫ్రాగ్’

న్యూఢిల్లీ: ఎప్పుడో వందేళ్ల క్రితమే నశించిపోయినట్లు భావిస్తున్న ట్రీ ఫ్రాగ్ 137 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చెట్టు తొర్రల్లో నివసిస్తుందికనుక దీనికి ట్రీ ఫ్రాగ్ అని పేరు వచ్చింది. భారత్ ఈశాన్య ప్రాంతంలో ఈ కప్పలను ప్రముఖ భారతీయ జీవ శాస్త్రవేత్త సత్యభామదాస్ బిజూ, ఆయన నిపుణల బృందం కనుగొన్నది. చైనా నుంచి థైవాన్ వరకు ఈ జాతి కప్పలు విస్తరించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.

ఈ ఫ్రాగ్‌ను ‘పోలిపిడేట్స్ జెర్డోని’ అనే శాస్త్రీయ నామంతో పిలిచేవారు. ఇక నుంచి ఫ్రాంకిగ్జాలస్ జెర్డొని అని పిలవాలని బిజూ నిర్ణయించారు. ‘ఫ్రాగ్ మేన్ ఇన్ ఇండియా’గా పేరుపొందిన బిజూ భారత్‌లోవున్న 350 కప్ప జాతుల్లో 89 జాతులను స్వయంగా కనుగొన్నారు. ఈ జాతి కప్పలు చెట్టు తొర్రల్లో భూ ఉపరితలానికి 19 అడుగుల ఎత్తువరకు నివసిస్తాయని, చెట్టు తొర్రల్లో నిలిచే నీళ్లలో ఇవి గుడ్లు పెడతాయని బిజూ వివరించారు.

చెట్టు తొర్రల్లో ఇవి చేసే శబ్దాలకు అవన్నీ కలసి ఓ కచేరి చేస్తున్నట్లు అనిపిస్తుందని, ఆ శబ్దాలు వినసొంపుగా ఉంటాయని బిజూ తెలిపారు. సమ శీతోష్ణ ప్రాంతాల అడవుల్లోనే ఈ జాతి కప్పలు ఎక్కువగా ఉంటాయని, వ్యవసాయం, ఇతర అవసరాల కోసం చెట్లను కొట్టివేయడం వల్ల ఈ జాతి కప్పలు నశిస్తూ వచ్చాయని ఆయన తెలిపారు. కప్ప జాతులకు కొత్త పేర్లను పెట్టే ప్రణాళికలో భాగంగా శోధిస్తుండగా అనుకోకుండా ఈ జాతి కప్పలు మళ్లీ కనిపించాయని ఆయన తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement