ఫేస్బుక్ స్నేహితురాలిపై అత్యాచారం | 'Facebook friend' accused of raping Gurgaon woman | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ స్నేహితురాలిపై అత్యాచారం

Published Wed, Jan 21 2015 7:03 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

'Facebook friend' accused of raping Gurgaon woman

గుర్గావ్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తనపై అత్యచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

 రాజన్ మల్హోత్రా (22) అనే వ్యక్తి 19 ఏళ్ల యువతికి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. రానురాను వీరి పరిచయం స్నేహంగా, ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజన్ ఆ అమ్మాయిని గుర్గావ్లోని ఓ హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రాజన్ తన ఫేస్బుక్ అకౌంట్ను తొలగించి, ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా రాజన్కు సంబంధించి పక్కా సమాచారం బాధితురాలి దగ్గర లేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement