అవసరం కోసం ఆశ్రయించినందుకు ఆకృత్యం | Woman, 24, Allegedly Raped In Car At Parking Of South Delhi Mall | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పెట్టిస్తానని కారులో ఎక్కించుకొని వెళ్లి..

Published Wed, Jun 21 2017 9:07 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

అవసరం కోసం ఆశ్రయించినందుకు ఆకృత్యం - Sakshi

అవసరం కోసం ఆశ్రయించినందుకు ఆకృత్యం

న్యూఢిల్లీ: అవసరాన్ని అవతలి వ్యక్తికి అవకాశంగా ఇస్తే ఓ మహిళ నుంచి అతడు ఏమైనా ఆశించవచ్చు.. ఏమైనా చేయవచ్చు. సరిగ్గా ఢిల్లీలో ఇదే జరిగింది. తనకు ఉద్యోగం లేకపోవడంతో ఓ మహిళ ఓ వ్యక్తిని ఆశ్రయించింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయిన అతడిని నమ్మి ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అతడు చెప్పే మాయమాటలు ఆ మహిళ నమ్మేసింది. ఉద్యోగంలో పెట్టిస్తానంటే నిజమే అనుకుని అతడి కారెక్కింది. ఆ ఒక్క చర్యే ఆమె పాలిట శాపంగా మారింది. అతడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల మహిళకు సోనూ సింగ్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. తనకు ఉద్యోగం కావాలని చెప్పడంతో తాను ఒక హోటల్‌లో ఉద్యోగంలో పెట్టిస్తానంటూ నమ్మబలికించి వెళ్లి కారు ఎక్కించుకున్నాడు. అనంతరం ఢిల్లీలోని సెలెక్ట్‌ సిటీ వాక్‌ మాల్‌లోని పార్కింగ్‌ ఏరియాకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపిన ఓ సాఫ్ట్‌ డ్రింక్‌ ఇచ్చాడు. అది తాగాక ఆమె మత్తులోకి జారుకోవడంతో అదే అదనుగా చూసుకున్న ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement