Sonu Singh
-
ప్రత్యర్థితో మేనకాగాంధీ వాగ్వాదం
లక్నో: కేంద్ర మంత్రి, సుల్తాన్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకాగాంధీ, తన ప్రత్యర్థి సోనూ సింగ్‌ల మద్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని’ సోనూ సింగ్‌ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. ‘నేను నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల పరిశీలనలో భాగంగా ఇక్కడికి వచ్చాను. పోలింగ్ సక్రమంగా జరుగుతుందో లేదో తెలసుకోవడం ఎలాంటి నేరం కాదు. సోనూ సింగ్‌తో ఉన్నవారిలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఓటు వేసే ముందు ఓటర్లను భయపెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ఉంద’ని మేనకా గాంధీ తెలిపారు. #WATCH: Minor argument between Union Minister and BJP's candidate from Sultanpur Maneka Gandhi and Mahagathbandhan candidate Sonu Singh after Gandhi alleged that Singh's supporters were threatening voters. #LokSabhaElections #Phase6 pic.twitter.com/l2Pn1yCRVO — ANI UP (@ANINewsUP) 12 May 2019 -
ప్రధాన నిందితుడికి కీలక నేత అండదండలు!
సాక్షి, అలహాబాద్: కేవలం కాలు తగలడంతో మొదలైన ఓ గొడవలో లా (న్యాయశాస్త్రం) విద్యార్థి దిలీప్ సరోజ్ హత్యకు గురికావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. కొన్ని విషయాలు వెలుగుచూశాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విజయ్ శంకర్ సింగ్‌కు రాజకీయ సంబంధాలున్నాయని, సుల్తాన్‌పూర్‌కు చెందిన ఓ కీలక నేత అండదండలున్నాయని పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... గత శుక్రవారం అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌కు దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రధాన నిందితుడు విజయ్ శంకర్‌కు దిలీప్ కాలు తగలడంతో వివాదం మొదలైంది. కొంత సమయానికే హాకీ స్టిక్స్‌తో, ఐరన్ రాడ్‌తో దిలీప్‌పై విజయ్ శంకర్, రెస్టారెంటె వెయిటర్ మున్నా చౌహాన్ దాడి చేశారు. కుప్పకూలిపోయిన దిలీప్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మృతిచెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా వెయిటర్ మున్నాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనను కొట్టినందుకే దిలీప్‌పై దాడి చేశానని వెయిటర్ చెబుతున్నాడు. దిలీప్ మృతి అనంతరం రైల్వే ఉద్యోగి, ప్రధాన నిందితుడు విజయ్ శంకర్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతడికి సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన కీలకనేత చంద్ర భద్రా సింగ్ అలియాస్ సోనూ సింగ్‌కు సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. సుల్తాన్పూర్కే చెందిన నిందితుడు విజయ్ సోనూ సింగ్ వద్ద తలదాచుకున్నడాని భావిస్తున్న పోలీసులు ఓ బృందాన్ని అక్కడికి పంపించారు. సోనూ సింగ్‌కు, విజయ్‌కి సంబంధం ఉన్నట్లు తమ వద్ద ఎన్నో సాక్ష్యాలు, ఫొటోలున్నాయని పోలీసులు చెబుతున్నారు. లా విద్యార్థి దిలీప్ హత్య కేసులో నిందితుడి కుటుంబసభ్యులతో పాటు అవసరమైతే సోనూ సింగ్‌ను విచారిస్తామని సీనియర్ పోలీస్ అధికారి అకాశ్ కుల్హారీ వివరించారు. -
అవసరం కోసం ఆశ్రయించినందుకు ఆకృత్యం
న్యూఢిల్లీ: అవసరాన్ని అవతలి వ్యక్తికి అవకాశంగా ఇస్తే ఓ మహిళ నుంచి అతడు ఏమైనా ఆశించవచ్చు.. ఏమైనా చేయవచ్చు. సరిగ్గా ఢిల్లీలో ఇదే జరిగింది. తనకు ఉద్యోగం లేకపోవడంతో ఓ మహిళ ఓ వ్యక్తిని ఆశ్రయించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన అతడిని నమ్మి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అతడు చెప్పే మాయమాటలు ఆ మహిళ నమ్మేసింది. ఉద్యోగంలో పెట్టిస్తానంటే నిజమే అనుకుని అతడి కారెక్కింది. ఆ ఒక్క చర్యే ఆమె పాలిట శాపంగా మారింది. అతడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల మహిళకు సోనూ సింగ్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. తనకు ఉద్యోగం కావాలని చెప్పడంతో తాను ఒక హోటల్లో ఉద్యోగంలో పెట్టిస్తానంటూ నమ్మబలికించి వెళ్లి కారు ఎక్కించుకున్నాడు. అనంతరం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్లోని పార్కింగ్ ఏరియాకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపిన ఓ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగాక ఆమె మత్తులోకి జారుకోవడంతో అదే అదనుగా చూసుకున్న ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేస్తున్నారు.