అదనపు కట్నం కోసం ఇద్దరు మహిళలను వేధిస్తున్న రెండు వేర్వేరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఫరీదాబాద్: అదనపు కట్నం కోసం ఇద్దరు మహిళలను వేధిస్తున్న రెండు వేర్వేరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయినట్టు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. హార్యానాలోని దయల్‌పూర్‌లో నివాసముంటున్న అన్సూ అనే మహిళకు గత జనవరి నెలలో ప్రవీణ్‌తో వివాహం అయింది. పెళ్లైనా నాటినుంచి కట్నం కోసం అత్తమామలు తనను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె భర్త ప్రవీణ్ సహా అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దయల్‌పూర్‌లో గాంధీ కాలనీలో అదనపు కట్నం కోసం వేధిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మిత్తు అనే మహిళ, తనను భర్త శ్యామ్, కుటుంబ సభ్యులు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.