7 కోట్లిచ్చినా.. నా యువరాజును అమ్మను! | farmer refuses to sell his bull for 7 crores | Sakshi
Sakshi News home page

7 కోట్లిచ్చినా.. నా యువరాజును అమ్మను!

Published Sat, Oct 18 2014 2:06 PM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

7 కోట్లిచ్చినా.. నా యువరాజును అమ్మను! - Sakshi

7 కోట్లిచ్చినా.. నా యువరాజును అమ్మను!

రోజుకు 20 లీటర్ల పాలు తాగుతాడు.. 5 కిలోల యాపిల్ పళ్లు తింటాడు.. 15 కేజీల మంచి నాణ్యమైన గడ్డి కూడా తింటాడు. ప్రతిరోజూ 4 కిలోమీటర్ల వాకింగ్ చేస్తాడు. ఇలాంటి నా యువరాజును ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదని చెబుతున్నాడు మీరట్కు చెందిన కరమ్వీర్ సింగ్. ఇంతకీ ఆ యువరాజు ఎవరనుకుంటున్నారా.. ఆయన తన కన్నకొడుకులా పెంచుకుంటున్న 1400 కిలోల బరువున్న ముర్రాజాతి దున్నపోతు. మీరట్లో జరిగిన అఖిల భారత పశు ప్రదర్శనలో ఇది ఛాంపియన్గా నిలిచింది. దీని ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.

చండీగఢ్కు చెందిన ఓ రైతు ఈ 'యువరాజు' ను కొంటానని.. 7 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు. కానీ కరమ్వీర్ మాత్రం ససేమిరా అమ్మేది లేదని తేల్చి చెప్పేశాడు. తాను 50 లక్షలకు కొన్నానని, కానీ దీన్ని మాత్రం డబ్బు దృష్టితో చూడనని చెబుతున్నాడు. ఇది ప్రతిరోజూ 3.5 నుంచి 5 మిల్లీలీటర్ల వీర్యం ఇస్తుంది. దాన్ని పల్చన చేసి 35 మిల్లీలీటర్లు చేస్తారు. ముర్రాజాతి గేదెల ఉత్పత్తికి దీన్ని వాడతారు. దీని అమ్మకం ద్వారా రోజుకు 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement