9న ఢిల్లీలో ఆర్థిక మంత్రుల భేటీ
9న ఢిల్లీలో ఆర్థిక మంత్రుల భేటీ
Published Fri, Jun 6 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ జూన్ 9వ తేదీన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు అవసరమైన నిధులపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఉమ్మడిరాష్ట్రంలో కేంద్రం నుంచి తీసుకున్న రూ.17,000 కోట్ల రుణాల మాఫీ, రూ.1,003 కోట్ల పోలీసు బలగాల మోహరింపు ఖర్చు రద్దు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను సడలింపు తదితరాలను ఈటెల కోరనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రిని ఈటెల కోరనున్నారు అంతేకాక, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని చేయనున్నారు.
Advertisement
Advertisement