
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జన్‌ధన్ యోజన. దేశ ప్రజలందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా.. కోట్ల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో కనీస మొత్తం సొమ్మేదీ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే గత ఏడాది కాలంలో జన్‌ధన్ ఖాతాలను వాడుకున్నది కేవలం 52 శాతమేనని ప్రపంచబ్యాంకు ‘ఫిన్‌డెక్స్’ నివేదిక చెబుతోంది. ఇటీవలే విడుదలైన ఈ నివేదిక సారాంశమిదీ..
31 కోట్లు
మార్చి 2018 నాటికి జన్‌ధన్ యోజన ద్వారా ఏర్పాటైన బ్యాంకు ఖాతాల సంఖ్య
48 శాతం
దేశంలో ఏడాది మొత్తమ్మీద ఒక్క లావాదేవీ నమోదు కాని ఖాతాలు (అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సగటున 25 శాతం మాత్రమే)
రూ. 81,002.64 కోట్లు
జన్‌ధన్ యోజన ఖాతాల్లో ఉన్న మొత్తం సొమ్ము
33 శాతం
డబ్బులు పంపేందుకు లేదా అందుకునేందుకే జన్‌ధన్ ఖాతాలను వాడుతున్నవారు
66 శాతం
లావాదేవీలు నడపని అకౌంట్లలో మొబైల్ ఫోన్లు ఉన్నవారు(డిజిటల్ టెక్నాలజీ ద్వారా వీరిని బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములు చేసేందుకు అవకాశం ఉందని ‘ఫిన్‌డెక్స్’ నివేదిక పేర్కొంది)
60 శాతం
గతేడాది ప్రపంచం మొత్తమ్మీద తెరుచుకున్న కొత్త బ్యాంకు ఖాతాల్లో భారత్ వాటా
19 కోట్లు (సుమారు)
దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేనివారి సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment