కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు లభించనుంది. పౌరులకు మంచి సేవలు అందించినందుకుగానీ ఇప్పటి వరకు అవార్డులు ఇస్తూ వస్తుండగా.. ఇకపూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డులతో సత్కరించనున్నారు.
ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి మానస పుత్రికల్లాంటి స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ఉద్యోగులుగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ విశేషంగా కృశిచేస్తే వారికి ప్రధాని చేతులమీదుగా అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న అందించనున్నారు.
సాధారణంగా ప్రతి సవత్సరం పౌరులకు ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు ప్రధానమంత్రి అవార్డులు అందిస్తుంటారు. కానీ, ఈసారి స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామిణ్), స్వచ్ఛ విద్యాలయ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంతోపాటు సాయిల్ హెల్త్ కార్డ్ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఉద్యోగులకు అవార్డులు అందించాలని నిర్ణయించారు.