Jan Dhan Yojna
-
రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్ మొత్తం రూ.3,398గా ఉంది. అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్‌ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు. చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
జన్ ‘ఖాళీ’ ధన్!
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జన్‌ధన్ యోజన. దేశ ప్రజలందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా.. కోట్ల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో కనీస మొత్తం సొమ్మేదీ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే గత ఏడాది కాలంలో జన్‌ధన్ ఖాతాలను వాడుకున్నది కేవలం 52 శాతమేనని ప్రపంచబ్యాంకు ‘ఫిన్‌డెక్స్’ నివేదిక చెబుతోంది. ఇటీవలే విడుదలైన ఈ నివేదిక సారాంశమిదీ.. 31 కోట్లు మార్చి 2018 నాటికి జన్‌ధన్ యోజన ద్వారా ఏర్పాటైన బ్యాంకు ఖాతాల సంఖ్య 48 శాతం దేశంలో ఏడాది మొత్తమ్మీద ఒక్క లావాదేవీ నమోదు కాని ఖాతాలు (అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సగటున 25 శాతం మాత్రమే) రూ. 81,002.64 కోట్లు జన్‌ధన్ యోజన ఖాతాల్లో ఉన్న మొత్తం సొమ్ము 33 శాతం డబ్బులు పంపేందుకు లేదా అందుకునేందుకే జన్‌ధన్ ఖాతాలను వాడుతున్నవారు 66 శాతం లావాదేవీలు నడపని అకౌంట్లలో మొబైల్ ఫోన్లు ఉన్నవారు(డిజిటల్ టెక్నాలజీ ద్వారా వీరిని బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములు చేసేందుకు అవకాశం ఉందని ‘ఫిన్‌డెక్స్’ నివేదిక పేర్కొంది) 60 శాతం గతేడాది ప్రపంచం మొత్తమ్మీద తెరుచుకున్న కొత్త బ్యాంకు ఖాతాల్లో భారత్ వాటా 19 కోట్లు (సుమారు) దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేనివారి సంఖ్య -
కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు లభించనుంది. పౌరులకు మంచి సేవలు అందించినందుకుగానీ ఇప్పటి వరకు అవార్డులు ఇస్తూ వస్తుండగా.. ఇకపూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డులతో సత్కరించనున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి మానస పుత్రికల్లాంటి స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ఉద్యోగులుగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ విశేషంగా కృశిచేస్తే వారికి ప్రధాని చేతులమీదుగా అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న అందించనున్నారు. సాధారణంగా ప్రతి సవత్సరం పౌరులకు ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు ప్రధానమంత్రి అవార్డులు అందిస్తుంటారు. కానీ, ఈసారి స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామిణ్), స్వచ్ఛ విద్యాలయ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంతోపాటు సాయిల్ హెల్త్ కార్డ్ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఉద్యోగులకు అవార్డులు అందించాలని నిర్ణయించారు. -
'జన ధన ఖాతాల్లో రూ.15 వేలు వేయాలి'
పాట్నా: జన ధన యోజన ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రతి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీయిచ్చిందని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం హామీ నిలుపుకోకుంటే మార్చి 15న ర్యాలీ చేపడతానని ఆయన ప్రకటించారు. పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తానని ఆయన తెలిపారు. జన ధన యోజన ఖాతాల్లో వెంటనే డబ్బు జమ చేయాలని కేంద్రాన్ని లాలూ డిమాండ్ చేశారు. -
జన బీమా యోజనను ప్రారంభించండి
ముంబై: బీమా పథకాలనూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏ) పేర్కొంది. బ్యాంకింగ్ సేవల విస్తరణ కోసం ఇటీవలే ప్రారంభించిన జన ధన యోజన మాదిరిగానే ప్రధాన మంత్రి జన బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ ప్రభుత్వానికి సూచించారు. సోమవారమిక్కడ పారిశ్రామిక మండలి ఫీక్కీ 16వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘బ్యాంకింగ్లాగే బీమా సేవలు కూడా మారుమూలలకు చేరడం లేదు. బీమాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మరిన్ని చర్యలు అవసరం’ అని విజయన్ పేర్కొన్నారు. ఇక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్న పరిశ్రమ డిమాండ్లపై కూడా విజయన్ స్పందించారు. దీనివల్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత 3.9 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతుందా అనేది పరిశ్రమే సమాధానం చెప్పాలన్నారు. బీమా రంగంలో అపార వృద్ధి అవకాశాలున్నాయని... అయితే, ఎఫ్‌డీఐల పెంపు వల్ల మొత్తం దేశానికి, అదేవిధంగా పాలసీదారులకు అంతిమంగా ప్రయోజనం దక్కుతుందాలేదా అనేది చూసుకోవాలని విజయన్ అభిప్రాయపడ్డారు. నాన్-లైఫ్ బీమా విభాగంలో కూడా భారీ అవకాశలున్నాయని.. వాహనాల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. మరోపక్క, ఏజెంట్లకు నెలకు రూ.10 వేల చొప్పున కనీస వేతనాలను ఇవ్వడంతో పాటు పరిశ్రమలో ఉద్యోగావకాలను కల్పించాల్సిందిగా బీమా కంపెనీలను విజయన్ కోరారు.