'నన్ను, నా కూతుర్ని వేధిస్తున్నారు'
లక్నో: బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆరోపించారు. తమ 12 ఏళ్ల కుమార్తెను మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. మాయావతిపై మొరటు వ్యాఖ్యలు చేయడంతో దయాశంకర్ కు వ్యతిరేకంగా బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనలు, ప్రకటనలు చేశారు. బీఎస్పీ మద్దతు చేసిన ప్రకటనలు అభ్యంతకరంగా ఉన్నాయని స్వాతి సింగ్ అన్నారు.
'వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నా భర్తపై కేసు నమోదు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయినా మాయావతి సంతృప్తి చెందలేదు. మమ్మల్ని బయటకు ఈడ్చాలని బీఎస్పీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో నా కుమార్తె చాలా బాధ పడింది. బీఎస్పీ నేతలు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలను ఎందుకు ఖండించరు? అలాంటి వారిని పార్టీ నుంచి ఎందుకు తొలగించరు?
నా భర్త నాలుక కోసి తెస్తే రూ.50 లక్షలు ఇస్తామని ఒకావిడ ప్రకటించింది. బలహీన వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న పార్టీ నేతలు ఇలాగేనా ప్రవర్తించేది? నన్ను, నా కుమార్తెను మానసికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేయాల'ని స్వాతి సింగ్ డిమాండ్ చేశారు.