దయాశంకర్కు బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్కు బెయిల్ మంజూరైంది. పూచీకత్తుగా 50 వేల రూపాయల విలువైన బాండ్లు రెండు సమర్పించాల్సిందిగా కోర్టు ఆయన్ను ఆదేశించింది. శనివారం మవు జిల్లా సెషన్స్ జడ్జి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న దయాశంకర్.. మాయావతి పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపిస్తూ ఆమెను వేశ్యతో పోల్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బీజేపీ దయాశంకర్ను పార్టీ పదవుల నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించింది. ఆజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన్ను యూపీ పోలీసులు గత నెల 29న బిహార్లో అరెస్ట్ చేశారు.